ఐపీఎల్ 2023 లో భాగంగా బుధవారం రాత్రి చెన్నై-రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అశ్విన్-రహానే మధ్య జరిగిన ఆసక్తికర సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అశ్విన్ చేసిన పనికి అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాడు రహానే.
ఐపీఎల్ 2023 టోర్నీ క్రికెట్ లవర్స్ కు అసలైన మజాను అందిస్తూ.. దూసుకెళ్తోంది. ఒక మ్యాచ్ ను మించి మరో మ్యాచ్ ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. తాజాగా బుధవారం రాత్రి జరిగిన చెన్నై-రాజస్థాన్ మ్యాచ్ కూడా అభిమానులను అలరించింది. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠతతో సాగిన ఈ మ్యాచ్ లో 3 పరుగుల తేడాతో ధోని సేన ఓటమి పాలైంది. చివరి ఓవర్ లో ధోని బ్యాటింగ్ చేస్తుండటంతో.. అందరు చెన్నై విజయం ఖాయం అనుకున్నారు. కానీ సందీప్ శర్మ అద్భుత బౌలింగ్ తో రాజస్థాన్ జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక ఈ మ్యాచ్ లో అశ్విన్-రహానే మధ్య జరిగిన ఆసక్తికర సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అశ్విన్ చేసిన పనికి అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాడు రహానే. ఆ వివరాల్లోకి వెళితే..
ఐపీఎల్ 2023లో భాగంగా.. బుధవారం రాత్రి రాజస్థాన్-చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ చివరి వరకు థ్రిల్లింగ్ గా సాగిన ఈ మ్యాచ్ లో 3 పరుగుల తేడాతో రాజస్థాన్ జట్టు విజయం సాధించింది. దాంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది రాజస్థాన్ టీమ్. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. జట్టులో బట్లర్(52), పడిక్కల్(38), అశ్విన్(30), హెట్ మేయర్ (30*) పరుగులు చేశారు. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. జట్టులో కాన్వే(50), రహానే(31), ధోని(32*) పరుగులు చేసినప్పటికీ జట్టుకు గెలిపించలేకపోయారు. ఇక ఈ మ్యాచ్ లో ఓ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో.. క్రీజ్ లో రహానే ఉన్నాడు.
ఈ క్రమంలోనే ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేయడానికి వచ్చాడు రవిచంద్రన్ అశ్విన్. ఇక తొలి బంతికి రెండు పరుగులు సాధించాడు రహానే. తర్వాత బంతిని వేసేందుకు సిద్ధమైన అశ్విన్ చివరి క్షణంలో బాల్ ను వేయకుండా కవ్వించాడు. దాంతో రహానే అసహనానికి లోనైయ్యాడు. ఆ తర్వాత బంతిని వేడానికి వచ్చిన అశ్విన్ కు కౌంటర్ ఇచ్చాడు రహానే. బంతి వేయడానికి అశ్విన్ రాగానే.. పక్కకు తప్పుకున్నాడు రహానే. దాంతో కంగు తినడం అశ్విన్ వంతు అయ్యింది. ఆ తర్వాత బంతిని అద్భుతమైన సిక్స్ గా మలిచి మరో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు రహానే. ఈ పరిణామంతో.. షాక్ కు గురైయ్యాడు అశ్విన్. ఒక్కసారిగా రహానే వైపు కోపంగా చూశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే అశ్విన్ కు ఇలా ప్రత్యర్థులను కవ్వించడం కొత్తేం కాదు. దాంతో ఫ్యాన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏంటి అశ్విన్ ప్రతీ సారి ఇలా చేయడం పద్దతి కాదు. నీకు రహానే సరైన సమాధానం చెప్పాడు అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
— CricDekho (@Hanji_CricDekho) April 12, 2023
Ajinkya Rahane hits Ravichandran Ashwin for SIX 🔥🔥
📷: Jio Cinema#IPL2023 #TATAIPL2023 #CSKvRR #Cricket #ChennaiSuperKings #RajasthanRoyals #AjinkyaRahane #RavichandranAshwin #Ashwin pic.twitter.com/juvdXDKVs0
— SportsTiger (@The_SportsTiger) April 12, 2023