రాజస్థాన్ పై ఓడిపోయి బాధలో ఉన్న చెన్నైకి మరో షాక్ తగిలింది. దాంతో చెన్నై జట్టు డేంజర్ లో పడబోతుందా? అన్న న్యూస్ ఇప్పుడు సీఎస్కే ఫ్యాన్స్ ను ఆందోళన పెడుతోంది. ఆ న్యూస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ 2023 లో భాగంగా బుధవారం రాత్రి చెన్నై-రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అశ్విన్-రహానే మధ్య జరిగిన ఆసక్తికర సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అశ్విన్ చేసిన పనికి అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాడు రహానే.