‘ఐపీఎల్ 2022’ రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది. ఒకటి రెండు మినహా అన్ని ఫ్రాంచైజీలు తమ ఆస్థాన ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి. మొదట సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ అసలు ఎవరినీ రిటైన్ చేసుకోవట్లేదు అని వార్తలు వచ్చాయి. కానీ, కేన్ మామ, సమద్, ఉమ్రాన్ మాలిక్ లను రిటైన్ చేసుకున్నట్లు వెల్లడించారు. మొదటి నుంచి హైదరాబాద్ టీమ్ లో ఒక సరైన తెలుగు ఆటగాడు లేడనే భావన ఉండేది. ఈ మెగా ఆక్షన్ లో ఆ తప్పును సరిదిద్దుకోవాలని హైదరాబాద్ చూస్తున్నట్లు తెలుస్తోంది.
చెన్నై టీమ్ అంబటి రాయుడిని రిటైన్ చేసుకోలేదు కాబట్టి.. రాయుడిని హైదరాబాద్ టీమ్ లోకి తీసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఎంత ఖర్చు అయినా అంబటి రాయుడిని టీమ్ లోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే వార్నర్ ను వదిలేసి తప్పుచేసిన హైదరాబాద్ అందులో సగం సరిదిద్దుకున్నట్లే అవుతుంది. ఎందుకంటే అభిమానులకు సైతం ఒక మంచి తెలుగు ఆటగాడు టీమ్ లో ఉంటే బాగుంటుందని ఎప్పటి నుంచో ఆశ. కొన్నాళ్లు హైదరాబాదీ సిరాజ్ ను తీసుకుంటారని ఎదురు చూశారు. కానీ ఆ అవకాశం రాలేదు. కాబట్టి ఈసారి అంబటిని మాత్రం ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే గానీ జరిగితే తెలుగు అభిమానులకు సంబరమనే చెప్పాలి. టీ20 అంబటి రాయుడు ఎంతటి విధ్వంసం సృష్టించగలడో అందరికీ తెలిసిందే. అంబటి రాయుడు సన్ రైజర్స్ టీమ్ లోకి వస్తే బాగుంటుందా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Presenting the 2️⃣ #Risers along with Captain Kane who will continue to don the #SRH colours in #IPL2022 🧡
We enter the auction with a purse of INR 68 crores. #OrangeArmy pic.twitter.com/2WwRZMUelO
— SunRisers Hyderabad (@SunRisers) November 30, 2021