ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ వరుసగా ఐదో ఓటమిని ముటగట్టుకుంది. బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో అత్యధిక ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన ముంబైకు ఈ ఏడాది మాత్రం అంతగా కలిసి రాట్లేదు. ముంబై ఇలా వరుస మ్యాచ్‌లలో ఓడిపోతుండడంతో ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై కూడా విమర్శలు అధికం అవుతున్నాయి. గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆర్సీబీ జట్టును సరిగా నడిపించడంలేదని, కోహ్లీ కెప్టెన్సీ కారణంగానే ఆర్సీబీ కప్ గెలవలేకపోయిందని సోషల్ మీడియాలో కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ విమర్శలు గుప్పించేవారు. కాగా ఇప్పుడు రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ కూడా దారుణంగా విఫలం అవుతుంది.
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా.. ముంబైకు ఐదుసార్లు కప్పు అందజేసిన రోహిత్ శర్మకు ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ అద్భుతంగా కెప్టెన్సీ చేస్తున్నాడని, టీమిండియా పగ్గాలు కూడా అతనికే అప్పగించాలని కూడా అప్పట్లో రోహిత్ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. కానీ.. టీ20, టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ తప్పుకోవడంతో రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ అయ్యాడు. గతంలో కెప్టెన్సీ విషయంలో కోహ్లీని, రోహిత్ శర్మ ఐపీఎల్ సక్సెస్‌తో పోల్చిన వారు.. ఇప్పుడు ఎందుకు స్పందిచడం లేదని కోహ్లీ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రషీద్ ఖాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన SRH కోచ్ ముత్తయ్య మురళీథరన్
Choose your captain carefully 😉
Virat kohli vs Rohit sharma #ViratKohli𓃵 #IPL2022 #DelhiCapitals #LSGvDC #MIvsRCB pic.twitter.com/oU5hvVkME6— Nisarg Chaudhari 🇮🇳 (@NRCHAUDHARY) April 8, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.