క్రికెట్ అభిమానులకు రెండున్నర నెలల పాటు వినోదం పంచిన ఐపీఎల్ ఆదివారం జరిగిన ఫైనల్‌తో ముగిసింది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన పైనల్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. ఛాంపియన్‌గా నిలిచింది. రెండో ఐపీఎల్ టైటిల్ కోసం పోటీ పడిన రాజస్థాన్‌కు నిరాశే ఎదురైంది. కాగా.. ఈ ఫైనల్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ భార్య చారులత రమేష్ పోస్టు చేసిన ఒక ఫొటోపై చర్చ జరుగుతోంది.
ఆ ఫొటో ఐపీఎల్ 2022 ప్రారంభ సమయంలో ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసిన ఒక స్పోర్ట్స్ ఛానల్ విడుదల చేసిన ఒక యానిమేటెడ్ ఫొటో. అందులో ఐపీఎల్‌లో పాల్గొన్న జట్లలోని ముఖ్యమైన ఆటగాళ్లు బైక్‌లపై ఐపీఎల్ కప్ కోసం రేస్‌లో పాల్గొంటున్నట్లు ఉంది. కానీ.. ఆ ఫొటోలో కేవలం తొమ్మిది జట్లకు చెందిన ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాళ్లు మాత్రం కనిపించడం లేదు. ఈ విషయంపై టోర్నీ ఆరంభంలో పెద్దగా చర్చ జరగలేదు. కానీ.. రాజస్థాన్ అద్భుతమైన ఆటతో ఫైనల్స్ వరకు వెళ్లడంతో.. సంజూ భార్య చారులత ఆ ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఈ ఫొటో చూడండి. ఇందులో పింక్ కలర్ జెర్సీ కనిపించకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది’ అంటూ పేర్కొంది.దీంతో రాజస్థాన్ రాయల్స్‌ను అవమానించిన ఆ స్పోర్ట్స్ ఛానెల్‌కు చారులత గట్టి కౌంటర్ ఇచ్చిందంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. రాజస్థాన్ రాయల్స్ కప్ గెలిచి ఉంటే ఇంకా సూపర్‌గా ఉండేదంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ విషయంపై రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కాగా అది అనుకోకుండా జరిగిన పొరపాటని, ఉద్దేశపూర్వకంగా రాజస్థాన్‌ను విస్మరించి ఉండని మరికొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. లీగ్ దశలో అద్భుత ప్రదర్శనలో రెండు స్థానంలో నిలిచిన రాజస్థాన్.. క్వాలిఫైయర్ వన్‌లో గుజరాత్ చేతిలో ఓడింది. కానీ క్వాలిఫైయర్ టూలో పటిష్టమైన ఆర్సీబీపై అద్భుత విజయం నమోదు చేసి ఫైనల్స్‌కు చేరింది. కానీ.. ఫైనల్లో గుజరాత్ చేతిలో పరాజయం పాలైంది. మరి సంజూ శాంసన్ భార్య చారులత ఇచ్చిన కౌంటర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL 2022లో సత్తా చాటిన టాప్ 10 అనామక ఆటగాళ్లు
Sanju Samson’s wife Charulatha Remesh’s story:
“Saw this animated video (of Star Sports) showing the race for IPL 2022 on the first day of IPL, and wondered why there wasn’t any pink jersey 🤔”#SanjuSamson #RajasthanRoyals #HallaBol #IPL2022 #starsports pic.twitter.com/GEEBlch2g8
— Unknown Loser (@Unknown86747419) May 28, 2022