ఐపీఎల్ 2022లో ఆదివారం ఒక నామమాత్రపు మ్యాచ్ జరిగింది. ఇప్పటికే ప్లేఆఫ్ రేస్ నుంచి తప్పుకున్న పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరిగింది. ఏ జట్టుకు ఉపయోగంలేని ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్ మూడో బంతికి పంజాబ్ బ్యాటర్ షారుఖ్ ఖాన్ క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో కెప్టెన్ మాయంక్ అగర్వాల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన షార్ట్ పిచ్ బంతి మయాంక్ పక్కటెముకల్లో తాగింది. ఉమ్రాన్ స్పీడ్‌ను అంచనా వేయలేకపోయిన మయాంక్.. గాయపడ్డాడు. గట్టిదెబ్బ తగిలినా.. పరుగులు పూర్తి చేసి నాన్ స్ట్రైకర్ ఎండ్‌కు వచ్చి కుప్పకూలిపోయాడు.
నొప్పితో విలవిల్లాడిపోయాడు. బాధను భరించలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. వైద్య సిబ్బంది హుటాహుటిన గ్రౌండ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రథమ చికిత్స అందించారు. కొద్ది సేపటికి కోలుకున్న మయాంక్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన తర్వాతి ఓవర్ ఐదో బంతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (43 పరుగులు 32బంతుల్లో 5ఫోర్లు 2సిక్సర్లు), రాహుల్ త్రిపాఠి (20 పరుగులు 18 బంతుల్లో), అయిడెన్ మార్క్రరమ్ (21), వాషింగ్టన్ సుందర్ (25పరుగులు 19బంతుల్లో 3ఫోర్లు 1సిక్సర్), రోమరియో షెఫార్డ్ (26పరుగులు 15బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) తలా ఓ చేయి వేయడంతో సన్ రైజర్స్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3, హర్ ప్రీత్ బార్ 3, రబాడా ఒక వికెట్ తీసుకున్నారు.
158 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ ఉఫ్ మని ఊదేసింది. పంజాబ్ బ్యాటర్లలో జానీ బెయిర్ స్టో (23పరుగులు 15బంతుల్లో 5ఫోర్లు), శిఖర్ ధావన్ (39పరుగులు 32బంతుల్లో 2ఫోర్లు), లియమ్ లివింగ్ స్టోన్ (49పరుగులు 22బంతుల్లో 2ఫోర్లు 5సిక్సర్లు), జితేష్ శర్మ (19పరుగులు 7బంతుల్లో 3ఫోర్లు 1సిక్సర్) దంచికొట్టడంతో 158 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 15.1ఓవర్లలోనే ఛేదించింది. 5 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుని లీగ్ చివరి మ్యాచ్‌ను గ్రాండ్‌గా ముగించింది. సన్ రైజర్స్ బౌలర్లలో ఫారూఖీ 2వికెట్లు తీసుకోగా..వాషింగ్టన్ సుందర్, జగదీష సుచిత్, ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా 3 వికెట్లు తీసిన పంజాబ్ బౌలర్ హర్ ప్రీత్ బ్రార్‌కు దక్కింది. ఈ మ్యాచ్ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలోకి చేరుకోగా సన్ రైజర్స్ 8వ స్థానంలోకి వెళ్లింది. మరి ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ గాయపడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: RCBని ఒంటిచేత్తో ప్లే ఆఫ్స్ కు పంపిన ఈ టిమ్ డేవిడ్ ఎవరంటే?
Watch: Mayank cops a nasty blow in the ribs by vicious bouncer from Umran Malik https://t.co/8Ljl0NWpM7
— Hindustan Times (@HindustanTimes) May 23, 2022