ఐపీఎల్ 2022లో కుల్దీప్ యాదవ్ అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీసి.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితలో యుజేంద్ర చాహల్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. చాహల్‌కు కుల్దీప్‌కు ఒక్క వికెట్ మాత్రమే తేడా. కాగా.. విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్‌గా ఉన్న సమయంలో కుల్దీప్ స్థానంలో అక్షర్‌పటేల్‌ను టీమిండియాలోకి తీసుకున్నాడని కుల్దీప్ చిన్ననాటి కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం కొంత బ్యాటింగ్ చేయగలడనే అంశంతో కుల్దీప్‌ను కాదని అక్షర్‌ను జట్టులోకి కెప్టెన్ కోహ్లీ తీసుకున్నాడని అన్నారు. కోహ్లీ కాదనుకున్న కుల్దీప్‌ను రోహిత్ శర్మ మాత్రం వెస్టిండీస్ టూర్ కోసం అతన్ని తీసుకున్నట్లు పేర్కొన్నాడు.
గత సీజన్‌లలో కేకేఆర్‌కు ఆడిన కుల్దీప్‌కు ఆ జట్టులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో టీమిండియాలో కూడా కుల్దీప్ చోటు కోల్పోవాల్సి వచ్చింది. కానీ.. కుల్దీప్ ఫామ్‌లో ఉన్నా.. కూడా కోహ్లీ అక్షర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు కుల్దీప్ కోచ్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం చర్చకు దారితీశాయి. ప్రస్తుతం కుల్దీప్ ఉన్న ఫామ్‌ను చూస్తే.. టీ20 వరల్డ్ కప్ కోసం అతనికి జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తుంది. పైగా ఇప్పుడు టీమిండియాకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉండడం కుల్దీప్‌కు కలిసొచ్చే అంశం. మరి కుల్దీప్ కోచ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: David Warner: వీడియో: విచిత్రమైన షాట్ ఆడిన వార్నర్! దీనికి మీరే పేరు పెట్టండి
Kuldeep Yadav Childhood Coach give credit to Rohit for his comeback! #RohitSharma #KuldeepYadav pic.twitter.com/Kp1RVUFCEq
— Dr. Cric Point 🏏 (@drcricpoint) May 2, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.
