ఐపీఎల్ 2022లో భాగంగా ఏప్రిల్ 22న రాజస్థాన్ – ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. మ్యాచ్ ఆఖరి ఓవర్ లో చోటుచేసుకున్న ‘నో బాల్‘ వివాదం కాస్తా.. వివాదాస్పదంగా మారింది. ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్, అంపైర్ నిర్ణయాన్ని నిరసిస్తూ.. ఆటగాళ్లను డగౌట్ కు పిలిచే దాకా వెళ్ళింది. తాజాగా ఈ ఘటనపై ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ స్పందించాడు. కరోనాతో హోటల్ కే పరిమితమైన పాంటింగ్ ఆ సమయంలో జట్టుతో లేనందుకు తన మీద తనకే కోపం వచ్చిందని చెప్పుకొచ్చాడు.
కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన పాంటింగ్ ప్రస్తుతం హోటల్‌లో క్వారంటైన్‌లో ఉంటున్నాడు. అక్కడి నుంచే టీవిలో మ్యాచ్ చూశానని చెప్పుకొచ్చిన పాంటింగ్, ఆ సమయంలో చాలా ఫ్రస్ట్రేషన్‌కు గురయ్యానని చెప్పాడు. కోపాన్ని, అసహనాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడట. మ్యాచ్ చూస్తూ 3-4 టీవీ రిమోట్లను పగొలగొట్టాడట. తన ఎదురుగా ఉన్న బాటిళ్లను గోడకేసి విసిర కొట్టాడట. ఈ విషయాన్ని పాంటింగ్ స్వయంగా వెల్లడించాడు. అలాంటి కీలకమైన సమయంలో కోచ్‌గా తాను జట్టుతో పాటు లేకపోయానని, అది తలచుకుంటే తన మీద తనకే కోపం వచ్చిందని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
🗣️ “We’re too good a team for the results not to change.” 👊🏼
📹 | An ecstatic @RickyPonting came out of quarantine to talk about the previous match and touched upon DC’s plans going forward in #IPL2022 💙#YehHaiNayiDilli | #CapitalsUnplugged#TATAIPL | #IPL | #OctaRoarsForDC pic.twitter.com/bZ1jIRlIqF
— Delhi Capitals (@DelhiCapitals) April 27, 2022
ఇది కూడా చదవండి: రన్ తీయకుండా ముచ్చట్లు.. రనౌట్ చేసిన పంత్
ఆ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. అనంతరం 223 పరుగుల లక్ష్య చేదంకు దిగిన ఢిల్లీ 19 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. చివరి ఓవర్ లో విజయానికి 36 పరుగులు అవసరమయ్యాయి. ఒబెడ్ మెక్‌కాయ్ వేసిన చివరి ఓవర్ మొదటి మూడు బంతులను సిక్స్‌లుగా మలిచిన రోవ్‌మెన్ పావెల్ మ్యాచ్ గెలిపించినంత పని చేశాడు. అయితే ఫుల్‌టాస్‌గా వచ్చిన మూడో బంతి ‘నో బాల్’గా భావించినా అంపైర్ ఇవ్వలేదు. దాంతో రిషబ్ పంత్ అసహనానికి గురయ్యాడు. బంతులు మిగిలి ఉన్నప్పటికీ.. బ్యాటర్లను వెనక్కి వచ్చేయండంటూ చేతులు ఊపాడు. చివరికి మ్యాచ్ కొనసాగించినా.. ఢిల్లీ 15 పరుగుల తేడా ఓడిపోయింది.
Ponting revealed that it was “frustrating” to watch the game.
(📸Credit: BCCI/IPL)#DelhiCapitals #DC #RajasthanRoyals #RR #RRvsDC #RickyPonting #IPL #IPL2022 #Cricket #CricketTwitter pic.twitter.com/dpYMz6gCGF
— SportsTiger (@sportstigerapp) April 27, 2022
Ricky Ponting#IPL2022 #DCvRR pic.twitter.com/MBhnRlvfjw
— RVCJ Media (@RVCJ_FB) April 22, 2022
Dc vs RR ‘ No ball ‘ Controversy Full Video | Croud Shouting Cheater Cheater pic.twitter.com/cfbSRYuhqs
— Ashishgupta (@Ashishgupji) April 23, 2022
ఇది కూడా చదవండి: రికీ పాంటింగ్ పై పృథ్వీ షా సంచలన వ్యాఖ్యలు!