ఐపీఎల్ 2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరివరకు ఉత్కంఠభరితంగా సాగి ఆఖరికి వివాదానికి తెరలేపింది. ఢిల్లీ విజయానికి చివరి ఓవర్ లో 36 పరుగులు కావాల్సి ఉండగా.. ఒబెడ్ మెకాయ్ వేసిన మొదటి మూడు బంతులను సిక్స్‌లుగా మలిచిన రోవ్‌మెన్ పావెల్ మ్యాచ్ గెలిపించినంత పని చేశాడు. అయితే, హై ఫుల్ టాస్‌గా వేసిన మూడో బంతిని ఫీల్డ్ అంపైర్లు నో బాల్‌గా ప్రకటించకపోవడం వివాదానికి కారణమైంది. ఢిల్లీ కెప్టెన్ పంత్.. ఆటగాళ్లను డగౌట్ కు వచ్చేయాలంటూ సంజ్ఞలు చేశాడు. ఈ విషయాన్ని అందరూ తప్పుపడుతుండగా, మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, ఆస్ట్రేలియా ఆటగాడు, ప్రస్తుత ఆర్సీబీ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ పంత్ కు మద్దతుగా నిలిచారు.
మందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ జోస్ బట్లర్(116 పరుగులు) సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. అనంతరం 223 పరుగుల లక్ష్య చేదంకు దిగిన ఢిల్లీ 19 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. చివరి ఓవర్ లో విజయానికి 36 పరుగులు అవసరమయ్యాయి. ఒబెడ్ మెక్‌కాయ్ వేసిన చివరి ఓవర్ మొదటి మూడు బంతులను సిక్స్‌లుగా మలిచిన రోవ్‌మెన్ పావెల్ మ్యాచ్ గెలిపించినంత పని చేశాడు. అయితే ఫుల్‌టాస్‌గా వచ్చిన మూడో బంతి ‘నో బాల్’గా భావించినా అంపైర్ ఇవ్వలేదు. దాంతో ఢిల్లీ డగౌట్‌లో తీవ్ర ఆగ్రహం కనిపించింది. నోబా ల్ ఇవ్వమంటూ సైగలు చేయడంతో పాటు, బ్యాటర్లను వెనక్కి వచ్చేయమంటూ పంత్ పిలవడం వరకు వెళ్లింది. బ్యాటర్లను వెనక్కి వచ్చేయమంటూ పంత్ చేసింది కరెక్టు కాదంటూ పలువురు మాజీ క్రికెటర్లు విమర్శిస్తుండగా, మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, ఆస్ట్రేలియా ఆటగాడు, ప్రస్తుత ఆర్సీబీ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ పంత్ కు సపోర్ట్ గా నిలిచారు.
Crazy 🤯🤯🤯 pic.twitter.com/JCcWZd9Tg6
— Sehwag (@Sehwag54587220) April 22, 2022
ఇది కూడా చదవండి: నో బాల్ ఘటనపై స్పందించిన పంత్! తప్పైందంటూ..
‘అది క్లియర్ నో బాల్’ అంటూ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేయగా.. మ్యాక్స్‌వెల్ మాత్రం సెటైరికల్‌గా బరాక్ ఒబామా ఎమోజీతో రెస్పాండయ్యాడు. “అంటే అంపైర్ ఫ్రంట్ ఫుట్ బాల్‌ని నో బాలో లేదో అని చెక్ చేయొచ్చు.. కానీ హై ఫుల్ టాస్ బాల్‌ని చెక్ చేయలేరనమాట.. ఏంటో ఇది.?” అంటూ సెటైరికల్‌గా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ గా మారాయి.
That was a clear no ball. #umpiring
— Irfan Pathan (@IrfanPathan) April 22, 2022
So umpires check no balls for front foot every ball, but can’t check a high full toss? Makes sense… pic.twitter.com/RUOX3Yh3YF
— Glenn Maxwell (@Gmaxi_32) April 22, 2022
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ, రాజస్తాన్ చేతిలో 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక ‘నోబాల్’ ఘటనపై స్పందించిన నెటిజన్లు.. గతంలో చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న ఎంఎస్ ధోని సైతం ఇలాగే వ్యవహరించాడని, బహుశా పంత్ అతడి నుంచే స్ఫూర్తి పొందాడేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇందుకు సంబంధించి మీమ్స్ షేర్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: నో బాల్ వివాదంపై చర్చ! ఆ రోజు ధోని చేసింది కరెక్టయితే ఇవాళ పంత్ చేసింది కరక్టే!