శీతాకాలం వాతావరణంతో చర్మం, జుట్టు దెబ్బతింటుంది. ఈ సీజన్‌లో వీచే చల్లని గాలులు ఆరోగ్యానికి కాకుండా చర్మానికి, జుట్టుకు కూడా హానికరం. ఈ సీజన్‌లో చాలా మంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటారు. అదేవిధంగా చర్మ సమస్యలు కనిపించడం ప్రారంభమవుతాయి. దీని పరిష్కారానికి అనేక చర్యలు తీసుకుంటారు. ఈ సందర్భంగా ఇంట్లో ఉండే పదార్థాలతో.. సులభంగా తయారు చేసుకునే డిటాక్స్ డ్రింక్స్ సహాయంతో చర్మం, జుట్టును ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. ఇంట్లో తయారు చేసిన ఈ డీటాక్స్ డ్రింక్స్ బాడీ మెటబాలిజాన్ని కూడా పెంచుతాయి. ఆ హెల్తీ డ్రింక్స్ ఏంటో తెలుసుకుందాం.
యాపిల్–దాల్చిన చెక్కతో..
ఈ డిటాక్స్ డ్రింక్ చేయడానికి రెండు లేదా మూడు అంగుళాల దాల్చిన చెక్క, కొద్దిగా దాల్చిన చెక్క తీసుకోండి. ఈ రెండింటినీ వాటర్ బాటిల్‌లో వేసి అందులో యాపిల్ ని సన్నగా, గుండ్రంగా కట్ చేసి అదే వాటర్ బాటిల్‌లో వేసి గంట లేదా రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. ప్రతిరోజూ ఉదయం ఈ డ్రింక్ తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
దోసకాయ, కీవీ, పుదీనా..
ఒక గాజు కూజాలో ఒక దోసకాయ, కీవీ ముక్కలు కట్ చేసి వేయాలి. ఉడికించిన పుదీనా ఆకులను కలపాలి. కూజాను నీటితో నింపి 2 గంటలు అలాగే వదిలేయాలి. ఈ డిటాక్స్ నీటిలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
ఆరెంజ్, స్ట్రాబెర్రీ..
నారింజ, స్ట్రాబెర్రీ ముక్కలను జాడీలో వేయాలి. అందులో తాజా పుదీనా ఆకులను వేసి, నీళ్లతో కలిపి రాత్రంతా అలాగే ఉండనివ్వాలి. ఈ డిటాక్స్ డ్రింక్‌లో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి ఉదయాన్నే తాగాలి. ఈ డ్రింక్ మంచి ఫ్యాట్ బర్నర్‌గా పనిచేస్తుంది. ఇది శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది.
పుదీనా, గ్రీన్ యాపిల్..
ఒక బాటిల్ నీటిలో గ్రీన్ యాపిల్ ముక్కలను వేయండి. అలాగే పుదీనా ఆకులు వేయాలి. ఇది రుచిని పెంచుతుంది. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి గంటసేపు అలాగే ఉంచాలి. ఈ డ్రింక్ రోజుకు రెండుసార్లు తీసుకోవచ్చు. ఇది మీ చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది
ద్రాక్ష, నిమ్మరసం..
నిమ్మరసం వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలుసు. ఇందులో నల్ల ద్రాక్ష కూడా కలుపుకుంటే దాని ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. నిమ్మకాయలు విటమిన్ సీ కి మంచి వనరు. ఈ డిటాక్స్ డ్రింక్ జుట్టు రాలకుండా చేస్తుంది. ముఖాన్ని కాంతివంతం చేస్తుంది. దీన్ని తయారు చేయడానికి ఒక లీటర్ నీటిలో 10–15 గ్రేప్స్, 1 నిమ్మకాయ రసం కలపాలి.
కొబ్బరి నీరు..
ప్రకృతిలో సహజసిద్దంగా లభించే కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసు. అలాగే జుట్టు, చర్మానికి కూడా మంచిది. కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేషన్‌తో పాటు అనేక వ్యాధులకు దూరంగా ఉంటుంది. అదే సమయంలో కొబ్బరి నీరు.. జుట్టు, చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. చలికాలంలో ఈ డ్రింక్స్ తాగి.. చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుకొండి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.