చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా నూటికి దాదాపు 90 శాతం మంది అశ్లీల చిత్రాలు చూస్తున్నారని పలు సర్వేల్లో వెల్లడైంది. వీరిలో చాలా మందికి అది అలవాటును దాటిపోయి వ్యసనంగా మారింది. ఇలాంటి వీడియోలను చూడటానికి కారణాలు ఏవైనా.. వాటిని చూడటం వ్యసనంగా మారటం కారణంగా కలిగే ఇబ్బందుల అన్నీఇన్నీ కాదు. దాని కారణంగా సాధారణ జీవితం అస్తవ్యస్తం అవుతుంది.
దాన్ని నుంచి బయటపడటం చాలా కష్టం.. రోజులో ఎక్కువ భాగం వాటిని చూడాలన్న దానిమీదే ధ్యాస ఉంటుంది. మిగితా వేటిమీద అంత శ్రద్ధ ఉండదు..కలగదు కూడా. అటు ఉద్యోగ జీవితం, ఇటు సంసారం జీవితం రెండూ ఫేయిల్ అయిపోతాయి. ఇలాంటి వీడియోలను చూడటం అలవాటుగా మారిన వారు దాన్నుంచి బయటపడాలంటే ఈ టిప్స్ పాటించాలి.