మారుతున్న కాలానికి అనుగుణంగా యువత ఆలోచనల్లో మార్పొస్తుంది. వచ్చే మార్పులను ఒడిసిపట్టుకుని వారికి అనుకూలంగా మలుచుకుంటున్నారు నేటి కాలం యువత. అయితే నిత్యం ఎదో పనుల్లో బిజీగా ఉంటూ వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మాని అనారోగ్య పాలవుతున్నారు. ఇక ఆఫీసుల్లో కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చొని వర్క్ చేసే వారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తింటుంది. ఇక వచ్చిన ఈ ఏడాదిలోనైన ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాలని చాలా మంది చూస్తుంటారు.
ఈ నేపథ్యంలోనే ఎలాంటి కసరత్తులు చేయాలి, ఎలా ముందుకు వెళ్లాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారు ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే. మనిషి చేసే వర్క్ ను బట్టి ఒత్తిడికి గురికావడం అనేది ఎక్కవవుతుంది. దీనికి తగ్గట్టుగానే ముఖ్యంగా మనిషి రోజుకు ఆరు గంటల పాటు నిద్రపోవాలి. ఇలా సరైన నిద్ర లేకుంటే దుష్ఫలితాలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఆ తర్వాత గంట పాటు క్రమం తప్పకుండా తమకు నచ్చిన వ్యాయమం, యోగా, జిమ్, సైక్లింగ్, వాకింగ్ వంటివి చేయాలి.శరీరానికి పొటిన్లు లభించే ఆహారాన్ని తీసుకునేందుకు మొదటి ప్రాధాన్యతనివ్వాలి. ఇందులో భాగంగా మాంసాన్ని తక్కువ మోతాదులో తీసుకుంటూ మొక్కల నుంచి లభించే బీన్స్, క్వినోవా, చిక్కుడు లాంటి తాజా కూరగాయలు సైతం తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. దీంతో పాటు కంప్యూటర్ల ముందు పని చేసేవారు అదే పనిగా కుర్చిలకు అతుక్కుపోకుండా రెండు గంటలకు ఒకసారి అలా కాసేపు తిరిగేందుకు ప్రయత్నించాలి. మరీ ముఖ్యంగా సిగరెట్ తాగడం, మద్యం సేవించడం వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండాలి.
ఉద్యోగశైలీలో భాగంగా చాలా మంది ఇంటికే పరిమితమవుతూ విటమిన్ డీ లోపం వల్ల అనేక రకాలైన వ్యాధులకు గురవుతున్నారు. దీని కారణంగా వచ్చే వ్యాదులకు దూరంగా ఉండాలంటే ఉదయం వచ్చే సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోవడం చాలా ఉత్తమం ఇలాంటి జాగ్రత్తలు పాటించి నియమాలు పాటించినట్లైతే మనిషి ఎలాంటి అనారోగ్యాలకు గురి కావడం చాలా తక్కువని నిపుణులు సూచిస్తున్నారు. ఇక కొత్త ఏడాది నుంచి ప్రతీ రోజు ఇలాంటి నియమాలు పాటించినట్లైతే ఈ ఎలాంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు.