ఈ ఏడాది మహాశిరాత్రికి ఓ ప్రత్యేకత ఉంది. శివరాత్రి శనివారం నాడు.. అందునా శనిత్రయోదశి నాడు వస్తుంది. ఇది చాలా శుభపరిణామం అని.. దీని వల్ల పలు రాశుల వారి సుడి తిరగబోతుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. మరి ఏ రాశుల వారిని అదృష్టం వరిస్తుంది అంటే..
హిందువులు జరుపుకునే పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. మిగతా పండుగలతో పోలిస్తే ఈ పర్వదినం చాలా ప్రత్యేకం. శివరాత్రి నాడు ప్రజలు ఉపవాసం ఉండి.. రాత్రంతా జాగరణ చేసి శివనామ స్మరణలో తరిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు మరీ ముఖ్యంగా జ్యోతిర్లింగ క్షేత్రాలు శివరాత్రి నాడు భక్తులతో కిక్కిరిసిపోతాయి. ఇక శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఆ వేడుకలు చూడటానికి రెండు కన్నులు చాలవు. ఇక మహాశివరాత్రి పర్వదినం రోజున శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈ సారి శివరాత్రికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ సారి శివరాత్రి శనివారం నాడు.. అది కూడా శనిత్రయోదశి నాడు వస్తుండటంతో.. చాలా విశిష్టమైనది అంటున్నారు పండితులు.
ఇక మన జీవితాలపై శని ప్రభావం ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సారి శనిత్రయోదశి రోజున శివరాత్రి వస్తుండటంతో.. ఈ పర్వదినం నుంచి కొన్ని రాశులకు వారికి శివానుగ్రహం వలల వారి దశ తిరగబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. శివుడి కటాక్షం మూడు రాశుల వారిపై ఉండబోతుందని.. వారికి అన్నీ మంచి ఫలితాలే సిద్ధిస్తాయని చేబుతున్నారు. మరి ఏ రాశుల వారిని అదృష్టం వరించనుంది అంటే..
మహాశివరాత్రి పర్వదినం నుంచి మేషరాశి వారి దశ తిరగబోతుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. మరీ ముఖ్యంగా వారి ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది అంటున్నారు పండితులు. మహాశివరాత్రి పర్వదినం నుంచి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశి వారికి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. అదృష్టం వారి పక్కనే ఉండి ముందుకు నడిపించడమే కాక.. వారి ఆర్థిక స్థితి బాగుపడుతుందని.. కొత్త ఆదాయం వర్గాలు కూడా మేష రాశి వారికి అందుబాటులోకి వస్తాయి అంటున్నారు పండితులు.
ఈ ఏడాది మహాశివరాత్రి నుంచి కర్కాటక రాశి వారు వ్యాపారంలో పురోగతి సాధిస్తారని అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. మహాశివరాత్రి నుంచి ఈ రాశి వారికి శివుడి అనుగ్రహంతో అనేక విజయాలను సాధిస్తారు అని పండితులు తెలుపుతున్నారు. వ్యాపారంలో పురోగతిని సాధిస్తారని.. ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని తెలుపుతున్నారు. అంతేకాక ఈ రాశి వారికి ఆర్థికపరమైన లాభాలు కూడా లభిస్తాయని అంటున్నారు పండితులు.
మహాశివరాత్రి నుంచి ధనస్సు రాశి వారికి చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. మహాశివరాత్రి నుంచి ఈ రాశి వారి అదృష్టం నక్క తోక తొక్కినట్టుగా మారబోతోంది అంటున్నారు. ఈ ఏడాది మహాశివరాత్రి పర్వదినం నుంచి ధనస్సు రాశి జాతకుల ఆరోగ్యం మెరుగుపడటమే కాక వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి అంటున్నారు పండితులు. అలానే శివరాత్రి నుంచి ధనస్సు రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని.. వ్యాపారంలో ఎంతో అభివృద్ధి సాధిస్తారని అంటున్నారు. శివరాత్రి నుంచి ఈ రాశి వారి జాతకం మారబోతుంది అంటున్నారు పండితులు.