ఈ మద్య కాలంలో ఆడవారిపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా మహిళలు బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ప్రతిరోజూ ఎక్కడో చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు అత్యాచారాలు జరుగుతున్నాయన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. కొంత మంది దుర్మార్గులు హూటల్స్, షాపింగ్ మాల్స్ ల్లో సీక్రెట్ కెమెరాలు ఉంచి మహిళలు వస్త్రాలు మార్చుకోవడం వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. స్కానింగ్ సెంటర్ లో సీక్రెట్ కెమెరాతో ఆడవారిని అసభ్యంగా వీడియో తీసిన ఘటన కేరళాలో బయటపడింది. పోలీసులు నింధితుడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
తిరువనంతపురంలో ప్రభుత్వ ఆరోగ్య శాఖతో ఓ ప్రైవేట్ స్కానింగ్ సంస్థ టై ఆప్ చేసుకుంది. అప్పటి నుంచి చాలా మంది రోగులు ఆ స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ చేయించుకుంటున్నారు. బిజినెస్ బాగా పెరిగిపోవడంతో మరో స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా చాలా మంది రోగులు ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకోవడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆ స్కానింగ్ సెంటర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ యువతి. స్కానింగ్ సెంటర్ లో తనను అసభ్యంగా వీడియో తీశారని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.
స్కానింగ్ సెంటర్ లోకి వెళ్లిన పోలీసులు అక్కడి సిబ్బందిని బయటికి వెళ్లకుండా ఆపి తనిఖీలు చేశారు. ఈ క్రమంలోనే స్కానింగ్ సెంటర్ రూమ్ లో ఓ షెల్ప్ లో బట్టల మద్య ఉన్న సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ సెల్ ఫోన్ ఎవరిది అని సిబ్బందిని ప్రశ్నించగా అందులో పనిచేస్తున్న అంజిత్ అనే యువకుడు తనదే అని చెప్పాడు. తాను అక్కడ చార్జింగ్ చేసుకోవడానికి పెట్టినట్టు బుకాయించాడు. అంజిత్ పొంతనలేని సమాధానం ఇవ్వడంతో.. పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నించడంతో నిజం చెప్పాడు.
అంజిత్ కి మొదటి నుంచి సెల్ ఫోన్ లో అశ్లీల వీడియోలు చూడటం అలవాటు. తాను కూడా అలాంటి పోస్ట్ ఎందుకు పెడితే డబ్బులు వస్తాయని ఆలోచనలో స్కానింగ్ సెంటర్ లో తన ప్లాన్ సీక్రెట్ గా అమలు చేశాడు. అక్కడికి వచ్చే ఆడవారిని అసభ్యంగా వీడియో తీస్తూ ఉండేవాడు. ఈ విషయాన్ని ఓ యువతి కనిపెట్టింది.. అతనిపై అనుమానంతో ఏంటని ప్రశ్నించగా తన సెల్ ఫోన్ చార్జింగ్ కోసం ఇక్కడ పెట్టానని నమ్మించాడు. కానీ ఆ యువతికి మాత్రం అజిత్ పై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అజిత్ ని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ ఫోన్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించామని అందులో ఎంత మంది ఉన్నారన్న విషయం త్వరలో తెలుస్తుందని అన్నారు.