కంటికి కనిపించని కరోనా వైరస్ పురుగు యావత్ ప్రపంచ మానవాళికి చుక్కలు చూపిస్తోంది. కేసులు క్రమ క్రమంగా పెరిగి ఇప్పటికీ చాలా మందే మరణించారు. ప్రస్తుతం కోవాగ్జిన్, కోవీషీల్డ్ వంటి వ్యాక్సిన్ లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇదే కాకుండా కరోనా నివారణకు ప్రపంచదేశాలు ఇప్పటికీ సరికొత్త వ్యాక్సిన్ కు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ లు తీసుకుంటుండటంతో ఈ మధ్యకాలంలో కరోనా కేసులు కూడా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైద్యమంటూ ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య మందుని అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మందుని తీసుకునేందుకు పొరుగు రాష్ట్రాల్లోని కొంతమంది నమ్మకంతో ఆనందయ్య వద్దకు వెళ్తున్నారు. ఇక హైదరాబాద్ లో ఆనందయ్య మందులా ఓ వ్యక్తి సరికొత్త ప్రయోగం చేయబోయి నలుక్కరుచుకున్నటైంది. అతని ప్రయోగం బెడిసికొట్టడంతో చివరికి ప్రాణాలు తీసుకున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ పరిధిలోని మచ్చబొల్లారంలో సురేశ్, ఆయన భార్య సంధ్య, తల్లి లక్ష్మీ కరోనా రాకుండా ఇటీవల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇటీవల ఓ వ్యక్తి పాలల్లో నల్ల ఉప్పు కలిపి తాగితే కరోనా నయం అవుతుందని నమ్మబలికాడు. ఇది నిజమేనని నమ్మిన సురేశ్ తల్లితో పాటు భార్యకు కూడా కలిపి తను కూడా తాగాడు. ఇక తాగిన కొద్దిసేపటికే ఆ కుటుంబం అంతా వాంతులు చేసుకోవటం మొదలు పెట్టారు.

ఇక భయంతో ఏం చేయాలో తెలియక యాశోద ఆస్పత్రికి వెళ్లారు. తాజాగా చికిత్స పొందుతు సురేష్ మరణించగా, తల్లీ, భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక సురేష్ మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. లేనిపోని ప్రయోగాలకు వెళ్లి సురేష్ ఇప్పుడు ప్రాణాలు పొగొట్టుకున్నాడంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సురేష్ చేసిన ప్రయోగం ఎంత వరకు కరెక్ట్ అనే దానిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
