సినిమా పరిశ్రమలో ఎంతో మంది మహిళలు, కారెక్టర్ ఆర్టిస్టులు అవకాశాల పేరిట తమను శారీరకంగా వాడుకున్నారంటూ ఎంతో మంది నోరు విప్పి రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి లైంగిక ఆరోపణలు మరోసారి వచ్చి చేరాయి. తాజాగా ఇలాంటి ఆరోపణలే మలయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబుపై వచ్చాయి. అవకాశాలు ఇప్పిస్తానంటూ ఓ మహిళపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు కేరళలోని కోజీకోడ్ లో కేసు నమోదయ్యింది.
ఇది కూడా చదవండి: నేను అలాంటి ఎక్స్‌ట్రాలు చేసే రకం కాదు: మెగాస్టార్ చిరంజీవి
మార్చి 13 నుంచి ఏప్రిల్ 14 వరకు విజయ్ తనపై అనేకసార్లు అత్యాచారం చేశాడని నటి ఫిర్యాదులో పేర్కోంది. ఇక మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తాజాగా నటుడు విజయ్ పై లైంగిక ఆరోపణలు రావడంతో మలయాళ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
అయితే,.. తనపై ఆరోపణలు నేపథ్యంలో నటుడు విజయ్ స్పందించాడు. ఆ నటిని ఊరికే వదలనంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. “నేను ఏ తప్పు చేయలేదు. నిజం చెప్పాలంటే ఈ విషయంలో నేనే బాధితుడిని. ఆమె వల్ల నా జీవితం నాశనమైంది. మానసిక ఒత్తిడి, కుంగుబాటుకు లోనవుతున్నానని గతేడాది నుంచి ఆమె నాకు వరుస మెసేజ్ లు పెట్టింది. ఆమె పెట్టిన మెసేజ్ ల స్క్రీన్ షాట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఆమెకు అవకాశాలు కావాలంటే ఆడిషన్స్ కు పిలిచి, సినిమాలో ఆఫర్ ఇప్పించా. కానీ, ఇప్పుడు ఆమె నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తోంది. ఈ విషయాన్ని నేను అంత సులువుగా వదిలిపెట్టను. ఆమెపై పరువునష్టం దావా వేస్తా” అని విజయ్ చెప్పుకొచ్చారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.