టెక్నాలజీ యుగంలో ప్రపంచం పరుగులు తీస్తుంటే మరోపక్క గ్రామాల్లో ఇంకా మూడనమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. దీని కారణంగా ఎంతో మంది అమాయకపు జనాల్ని ఉళ్లో నుంచి తరిమేస్తూ దారుణంగా అవమానిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా నడిరొడ్డుపై గ్రామస్థులంతా చితకబాది ఇష్టమొచ్చిన రీతిలో వారిపై దాడులకు తెగబడుతున్నారు. అచ్చం ఇలాంటి అవమానవీయ ఘటనే తాజాగా పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి.
అసలు ఏం జరిగిందంటే?ముర్షీదాబాద్ జిల్లా రఘునాథ్గంజ్ పరిధిలోని మథురాపుర్ ప్రాంతం. ఇదే గ్రామంలో నివాసం ఉంటున్న ఓ కుటుంబంపై ఇటీవల చేతబడి చేస్తున్నారని గ్రామస్థులంతా చర్చించుకున్నారు. ఈ వార్త ఊరంతా పాకింది. దీంతో గ్రామంలోని పెద్దలతో పాటు ప్రజలంత ఆ కుటుంబం ఇంటికి కూడకట్టుకుని వచ్చారు. వస్తూ వస్తూనే చేతబడి చేస్తున్నారా అంటూ ఆ అమాయకపు కుటుంబాన్ని నడిరోడ్డు మీదకు లాగారు.
ఇది కూడా చదవండి: Nandyal: కిలేడీ: విడాకులు ఇవ్వకుండానే.. ముగ్గురిని పెళ్లాడింది!
ఇక ఇంతటితో ఆగకుండా వారిపై విచక్షణ రహితంగా కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఇక మరో దారుణమైన విషయం ఏంటంటే? గ్రామంలో ఉంటూ చేతబడి చేస్తారా అంటూ ఏకంగా మూత్రాన్ని బలవంతంగా తాగించారు. ఇలా నడిరోడ్డుపై ఆ కుటుంబాన్ని అవమానకరంగా హింసిస్తూ దారుణ చర్యకు పాల్పడ్డారు. ఇక ఇదే ఘటనకు సంబంధించి అక్కడున్న కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇది మెల్లమెల్లగా పోలీసుల వరకు వెళ్లింది.
దీంతో వెంటనే స్పందించిన పోలీసులు గ్రామంలోకి వెళ్లి బాదిత కుటుంబాన్నివిచారించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ వీడియోలు చూసిన కొంతమంది నెటిజన్స్ బాదితులపై అనవసరంగా దాడికి పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వేడుకుంటున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.