నేటి కాలం యువత చిన్న చిన్న కారణాలకే మనస్థాపానికి గురవుతున్నారు. ఇంతటితో ఆగుతున్నారా? అంటే అదీ లేదు. క్షణికావేశంతో ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించారని, అడిగింది కాదన్నారని ఇలాంటి కారణాలకే నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామం. ఇదే గ్రామానికి చెందిన చెవ్వ నిఖిత బీఫార్మసీ చదువుతూ తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అయితే ఇటీవల నిఖితను తన తండ్రి మందిలించాడు. దీంతో ఆ యువతి తీవ్ర మనస్థాపానికి గురైంది. తండ్రి మందలించాడనే కారణంతో వెక్కి వెక్కి ఏడ్చింది.
ఇది కూడా చదవండి: Peddapalli: అన్నం పెడతానని తీసుకెళ్లి.. తొమ్మిదేళ్ల బాలికపై 44ఏళ్ల వ్యక్తి అత్యాచారం!
ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ క్రమంలోనే నిఖిత ఊహించని నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసింది. ఇక వెంటనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఇది గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హుటాహుటిన వచ్చిన ఆ యువతి తల్లిదండ్రులు నిఖితను ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే నిఖిత ప్రాణాలు కోల్పోయిందని నిర్దారణకు వచ్చారు.
క్షణికావేశంతో కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.