విశాఖ మధురవాడలో నవ వధువు పెళ్లి పీటల మీదే కుప్పకూలి.. మృతి చెందిన సంగతి తెలిసిందే. జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో నవ వధువు సృజన.. పెళ్లిపీటల మీదు కుప్పకూలింది. తొలుత గుండె పోటు కారణంగా సృజన మృతి చెందినట్లు భావించినా.. ఆ తర్వాత ఈ కేసులో అనేక ట్విస్ట్‌లు వెలుగు చూశాయి. సృజన పెళ్లికి ముందు రోజు సృజనకు కడుపునొప్పి వచ్చిందని.. ఆస్పత్రికి తీసుకెళ్లారని.. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం బాగయినట్లు తెలిపారు. మరోవైపు సృజన బ్యాగ్‌లో గన్నెరు కాయల తొక్కలు లభించడంతో అనుమానాలు పెరుగుతున్నాయి. ఇక ఆమె శరీరంలో విష పదార్థాలున్టుట్టు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం సృజనది ఆత్మహత్యగా నిర్ధారించారు పోలీసులు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Bride Srujana: విశాఖ పెళ్లికూతురు మృతిలో ట్విస్ట్! పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఊహించని నిజాలు!
ఈ క్రమంలో తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. సృజన తల్లిదండ్రుల తీరుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణంలో భాగంగా సృజన మొబైల్ ఫోన్‌ని పోలీసులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. కానీ మృతురాలు తల్లిదండ్రులు.. పోలీసులుకు మొబైల్ ఫోన్‌ని ఇవ్వడంలో ఆలస్యం చేశారు. పోలీసులు గట్టిగా అడిగేంతవరకు మొబైల్‌ని వారికి ఇవ్వలేదు. అంతేకాక మొబైల్‌లో మెసేజ్‌లు, వాట్సాప్ చాట్, మెయిల్స్ డిలీట్ చేసి.. ఆ తర్వాత ఫోన్‌ను పోలీసులకు అప్పగించారు. దాంతో పోలీసులు డేటా రీట్రీవ్ చేస్తున్నారు. కేసు దర్యాప్తులో సహకరించాల్సిందిగా సృజన తల్లిదండ్రులను కోరుతున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్, మొబైల్‌లో డిలీట్ అయిన డేటాను రిట్రీవ్ చేస్తే.. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Bride Srujana: విశాఖ పెళ్లికూతురు మృతి! వైరల్ గా మారిన ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో!