దేశంలో అమ్మాయిల అందాన్ని ఆసరాగా చేసుకుని చాలా మంది గలీజ్ పనులకు శ్రీకారం చుడుతున్నారు. మరీ ముఖ్యంగా చదువుకునే అందమైన అమ్మాయిలను వలలో వేసుకుని మహిళలే దగ్గరుండి ఈ పాడు పనులు చేయిస్తున్నారు. ఇలాంటి చీకటి దందాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా సాగుతున్నాయి. అయితే అచ్చం ఇలాంటి గలీజ్ పనులకే పావులు కదిపిన ఓ మహిళా డాక్టర్ అమ్మాయిలను తీసుకొచ్చి దారుణాలకు పాల్పడుతుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన మహిళా డాక్టర్ పాడు పనుల వ్యవహారం ఎట్టకేలకు బయటపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఆ మహిళా డాక్టర్ ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో అసలు ఏం జరిగింది? వైద్యం పేరుతో ఆ ఆర్ఎంపీ వైద్యురాలు ఎలాంటి నీచానికి పాల్పడిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆమె పేరు రాధిక. ఏపీలోని విజయవాడ గాంధీనగర్ లో నివాసం ఉంటుంది. రాధిక భర్త ఆర్ఎంపీ డాక్టర్ గా ఉండి గతంలో ఎంతోమందికి సేవలు అందించారు. అలా తన సేవలను కొనసాగిస్తున్న తరుణంలోనే కరోనాతో పోరాడి చివరికి రాధిక భర్త ప్రాణాలు కోల్పోయాడు. ఇక భర్త మరణించిన నాటి నుంచి భార్య రాధిక భర్తలాగే ఆర్ఎంపీ డాక్టర్ గా సేవలు అందించాలని అనుకుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఆ మహిళా వైద్యం పేరుతో ఊహించిన నీచానికి పాల్పడింది. అందమైన అమ్మాయిలే టార్గెట్ గా చేసుకుని వ్యభిచారాన్నినడిపిస్తుంది. ఇలా ఎంతోమంది మహిళలను వాట్సప్ గ్రూప్ గా తయారు చేసుకుని వైద్యానికి వచ్చిన అనేక మంది అమ్మాయిలను ఈ పాడుపనులు చేయిస్తుంది.
వైద్యం పేరుతో ఆ మహిళ చేస్తున్న ఈ గలీజ్ దందాను స్థానికులు గమనించారు. దీంతో ఎలాగైన ఆ మహిళ వ్యవహారాన్ని బట్టబయలు చేయాలని అనుకున్నారు. అయితే ఇటీవల బుధవారం ఓ యువకుడు రూ.10 వేలకు ఓ అమ్మాయిని బుక్ చేసుకున్నాడు. దీంతో ఆ మహిళా డాక్టర్ ముందుగానే ఆ అమ్మాయిని ఓ గదిలో ఉంచింది. అనంతరం రాధిక ఆ యువకుడిని ఓ చోటకు రమ్మని.., అతని వద్ద రూ.5000 తీసుకుని మిగతా డబ్బులు ఆ యువతికి ఇవ్వాలని కోరి అతడిని పంపించింది. దీనిని అంతా గమనించిన స్థానికులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన గుట్టుచప్పుడు కాకుండా అక్కడికి చేరుకుని వ్యభిచారం ఇంటిపై దాడులు చేశారు. ఈ దాడిలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని.. వ్యభిచారాన్ని నడిపిస్తున్న రాధికను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.