దేశంలో ప్రతిరోజు ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. డ్రైవర్లు చేసే చిన్న పొరపాటు వల్ల ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం లాంటివి ఈ ప్రమాదాలకు ఎక్కవ కారణం అంటున్నారు అధికారులు.
దేశంలో ప్రతి నిత్యం రోడ్డు ప్రమాదాలు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంటి పెద్దను కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. డ్రైవర్లు నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం ఈ ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి. తాజాగా రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. రాజస్థాన్ లో దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న ఓ వాహనం ప్రమాదానికి గురై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు.. మరో వ్యక్తి మరణించారు. వివరాల్లోకి వెళితే
రాజస్థాన్ టోంక్ జిల్లాలో డియోలికి చెందిన భక్తులు ఖాతు శ్యామ్ ఆలయంలో పూజలు చేసి తిరిగి ఇంటికి వ్యాన్ లో బయలు దేరారు. దేవ్దావాస్ క్రాసింగ్ వద్దకు వ్యాన్ రాగానే ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టింది.. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే కన్నమూశారు. మరణించిన వారిలో ముగ్గురు ఒకే కుటుంబాని చెందినవారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. క్షతగాత్రులను చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక మరణించిన వారు మనీష్ శర్మ, అతి భార్య ఇషు, సోదరుడు అమిత్ తో పాటు వ్యాన్ డ్రైవర్ రవిగా పోలీసులు గుర్తించారు. ఇక జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీ వద్ద ఉదయం ఓ మినీ బస్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా మరో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు కేవల్ కి చెందిన అహ్మద్, బదర్ హుస్సేన్ లుగా పోలీసులు గుర్తించారు. ప్రతిరోజూ దేశంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని.. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నప్పటికీ కొంతమంది డ్రైవర్లు అలాగే ప్రవర్తిస్తున్నారని అధికారులు అంటున్నారు.
Van accident kills four in Rajasthan’s Tonk; two dead after bus turns turtle in J&K’s Rajouri.https://t.co/uEsEnhY21D
— TIMES NOW (@TimesNow) March 2, 2023