దేశంలో దుండగులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఆడది రోడ్డు మీద కనిపడితే చాలు ఐ లవ్ యూ చెప్పడం, కాదంటే అత్యాచారాలు చేస్తున్నారు. ఇలాంటి దారుణాలు రోజుకో చోట వెలుగు చూస్తున్నాయి. వీటిపై ప్రభుత్వాలు నిర్భయ, దిశా వంటి కఠినమైన చట్టాలు రూపొందించినా దుర్మార్గుల ఆలోచనలో మాత్రం మార్పు రావడం లేదు. సరిగ్గా ఇలాంటి దారుణ ఘటనే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. లఖింపూర్ కేర్ జిల్లాకు చెందిన ఓ 15 ఏళ్ల బాలిక శనివారం బహిర్భూమికి వెళ్లింది.
బాలిక రాకను గమనించిన ఐదుగురు దుర్మార్గులు అక్కడి నుంచి ఆ బాలికను ఎత్తుకెళ్లారు. అనంతరం ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత ఒకరు ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అభం, శుభం తెలియని ఆ బాలికకు ఆ కేటుగాళ్లు నరకం చూపించారు. ఇక అత్యాచారం చేయడమే కాకుండా ఆ బాలికపై దాడికి కూడా పాల్పడ్డారు. ఈ కేటుగాళ్ల చెర నుంచి ఆ బాలిక తప్పించుకుని ఎట్టకేలకు బయటపడింది. జరిగిన దారుణాన్ని ఆ బాలిక ఆమె తల్లిదండ్రులకు వివరించింది.
కోపంతో ఊగిపోయిన ఆ దంపతులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణంపై ఆ బాలిక కటుంబ సభ్యులు, స్థానికులు ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.