రోడ్డుపై ఆడది కనిపిస్తే చాలు కొందరు మగాళ్లు మృగాళ్లు మారిపోతున్నారు. కోరిక తీర్చాలంటూ వెంటపడుతూ సహకరించకపోతే అత్యాచారం చేసి ఆపై హత్య చేస్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన కొందరు యువకులు రెచ్చిపోయి ప్రవర్తించారు. రోడ్డుపై వెళ్తున్న ఓ దంపతులపై పాడు పనికి కాలుదువ్వారు. ఏకంగా భర్త కళ్లముందే అతని భార్యపై ఆ దుర్మార్గులు ఊహించని దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
అసలేం జరిగిందంటే? ఉత్తర్ ప్రదేశ్ లోని మలిహాబాద్ లో ఓ దంపతులు రోడ్డుపై వెళ్తున్నారు. అయితే ఈ దంపతుల రాకను గమనించిన కొందరు యువకులు దారుణానికి పాల్పడ్డారు. మేము కమ్యూనిటీ పోలీసింగ్ అంటూ రెచ్చిపోయి ఆ దంపతులను దాడి చేస్తూ కాళ్లతో తన్నారు. ఇక మృగాళ్లు ఇంతటితో ఆగలేదు. భర్త కళ్ల ముందే అతని భార్య జుట్టి పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ఇక కాపాడబోయిన వారిపై కూడా ఆ దుండగులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ దారుణాన్ని అంత ఈ దుర్మార్గులు సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు.
ఇక అదే వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో కాస్త వైరల్ గా మారాయి. ఈ వీడియోలపై స్పందించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అనంతరం నిందితులు ఎవరనేది వీడియో ఆధారంగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అనంతరం దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇదే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి.