హోలీ సంబరాల్లో దారుణం జరిగింది. ఫ్రెండ్స్ తో హ్యాపీగా హోలీ జరుపుకుంటున్న ఓ యువకుడిని కొందరు దుండుగుల గొంతు కోసి పరాయ్యారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
హోలీ సంబరాల్లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని కొందరు గుర్తు తెలియని దుండుగులు బ్లేడుతో గొంతు కోసి పరారయ్యారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఆ యవకుడిని ఎందుకు బ్లేడుతో గొంతు కోశారు? దీని వెనకాల అసలేం జరిగిందంటే? అది ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్ షహార్ ప్రాంతం. ఇక్కడే ఓ యువకుడు నివాసం ఉంటున్నాడు. అయితే దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగిన హోలీ వేడుకల్లో ఆ యువకుడు కూడా పాల్గొన్నాడు. తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో ఆ యువకుడు ఫ్రెండ్స్ తో సంతోషంగా హోలీ పండుగను జరుపుకున్నాడు.
ఈ క్రమంలోనే కొందరు గుర్తు తెలియని దుండగులు కాపుకాసి ఆ యువకుడి బ్లేడుతో గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు హుటాహుటిన అతడిని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ యువకుడిపై దాడికి పాతకక్షలే ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
— Hardin (@hardintessa143) March 9, 2023