దేశంలో ఆడ పిల్లలపై జరుగుతున్న ఆఘాయిత్యాలు, లైంగిక వేధింపుల పట్ల రక్షణగా ఉండాల్సిన కొందరు పోలీసులే దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ఆఫీసర్.. ఏకంగా ఓ స్కూల్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ అయింది.
బాధ్యత గల వృత్తిలో ఉన్న కొందరు పోలీసులు అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారు. డ్యూటీలో ఉండగానే మద్యం సేవించడం, రోడ్డుపై వెళ్లే వాహనదారులతో అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి ఘటనలు మనం అనేకం చూశాం. అయితే తాజాగా ఓ పోలీస్ ఆఫీసర్ అర్థరాత్రి నడి రోడ్డుపై వెళ్తున్న ఓ స్కూల్ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధించాడు. అంతేకాకుండా ఆమె ప్రైవేట్ పార్ట్ లను తాకుతూ దారుణంగా వ్యవహరించాడు. ఇక ఇదంతా గమనించిన కొందరు వ్యక్తులు వీడియోలు తీసుకున్నారు. దీనిపై స్పందించిన అధికారులు అతడికి ఊహించిన ఝలక్ ఇచ్చారు. అసలేం జరిగిందంటే?
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఓ విద్యార్థి స్థానికంగా చదువుకుంటుంది. అయితే ఇటీవల ఆ బాలిక రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ ఆ బాలికను వెళ్లకుండా అడ్డుకున్నాడు. అంతేకాకుండా ఆ విద్యార్థినితో అసభ్యకరంగా మాట్లాడుతూ ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఆ బాలిక అతడి చెర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినా.. అతడు అస్సలు వదలలేదు. దీంతో ఆ బాలిక ఎలాగో అతడి చేతుల్లోంచి బయపడి అక్కడి నుంచి పరుగులు తీసింది. ఇదంతా గమనించిన కొందరు వ్యక్తులు ఆ బాలికను కాపాడాల్సింది పోయి సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు.
ఇక అదే వీడియొలో సోషల్ మీడియోలో పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. అనంతరం ఆ బాలిక వెంటనే ఆ కానిస్టేబుల్ తీరుపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే బాధ్యత గల వృత్తిలో ఉండి పైగా డ్యూటీలో ఉండి రక్షణ కల్పించాల్సింది పోయి.. అభం, శుభం తెలియని ఓ విద్యార్థిని లైంగికంగా వేధించడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయి అతడిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. ఆడపిల్లలను రక్షించాల్సిన ఓ పోలీస్ ఆఫీసర్.. ఓ విద్యార్థినిపై వేధింపులకు పాల్పడిన ఇతడి దారుణంపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మధ్య ప్రదేశ్‌లో దారుణం
భోపాల్ – రోడ్ మీద వెళుతున్న స్కూల్ విద్యార్థినిని లైంగికంగా వేదించిన పోలీస్. వీడియో వైరల్ కావడంతో సస్పెండ్ చేసిన పోలీసులు.#Bhopal #MadhyaPradesh pic.twitter.com/4XG3hncWYh
— Telugu Scribe (@TeluguScribe) March 9, 2023