ఈ మధ్యకాలంలో కొంత మంది మహిళలు తాళికట్టిన భర్తను కాదని పరాయి మగాళ్లపై మనసుపడుతున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా ప్రేమా, గీమా అంటూ చివరికి కట్టుకున్న భర్తను కాటికి పంపి ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ ఇల్లాలు ప్రియుడిపై మోజుపడింది. ఇక ప్రియుడితో కలిసి ఉండేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని భర్తను దారుణంగా హత్య చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్ షహార్ లో నీతు అనే మహిళ నివాసం ఉంటుంది. ఈమెకు ఇదే ప్రాంతానికి చెందిన సతీష్ అనే వ్యక్తితో రెండేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఆ మహిళ ఇంటి వద్దే ఉండేది. అయితే ఈ క్రమంలోనే ఆ మహిళ తన బుద్దిని వక్రమార్గంలోకి నెట్టేసింది. విషయం ఏంటంటే? గత కొన్ని రోజుల కిందట ఈ దంపతులు కొత్త ఇల్లును నిర్మించుకున్నారు. వీరి ఇల్లు నిర్మాణం కోసం వచ్చిన తాపీ మేస్త్రీతో నీతుకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే కాస్త ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది.
నీతు తన చీకటి ప్రేమాయణాన్ని భర్తకు తెలియకుండా కొనసాగిస్తూ వచ్చింది. కానీ నీతుకు మాత్రం భర్త కన్న ప్రియుడితో ఉండేందుకే ఇష్టపడింది. ఇలా అయితే కాదని భావించిన నీతు… ప్రియుడితో కలిసి భర్తను చంపాలని అనుకుంది. ఇందులో భాగంగానే ఈ నెల 2న నీతు ప్రియుడితో కలిసి భర్త గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం ఇద్దరూ కలిసి భర్త శవాన్ని నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ లో పడేసి ఆ తర్వాత ప్లాస్టరింగ్ చేశారు.
ఉన్నట్టుండి సతీష్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. పోలీసుల విచారణలో భాగంగా నీతును విచారించగా మొదట్లో పొంతనలేని సమాధానాలు చెప్పింది. చివరికి పోలీసుల స్టైల్ లో విచారించేసరికి అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. సతీష్ మృతదేహాన్ని వెలికి తీసిన అనంతరం పోలీసులు నీతుతో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.