ముహూర్తానికి ఇంకా కొన్ని గంటల సమయమే ఉంది. ఇదే సమయంలో వరుడు.. కాబోయే భార్యకు అది తక్కువగా ఉందని, నేను ఆమెను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. ఆ తర్వాత వధువు ఇచ్చిన షాక్ కి వరుడికి దిమ్మతిరిగింది. అసలేం జరిగిందంటే?
ఈ మధ్యకాలంలో చాలా మంది పెళ్లి ఇంకా కొన్ని గంటల సమయమే ఉందనగా.. రక రకాల కారణాలతో పెళ్లికి నో చెబుతున్నారు. అయితే అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ వరుడు.. కాబోయే భార్యకు అది తక్కువగా ఉందని పెళ్లికి నిరాకరించాడు. వరుడి మాటలు విన్న వధువు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. ఆ తర్వాత వధువు ఇచ్చిన షాక్ తో వరుడికి దిమ్మతిరిగి బొమ్మ కనపడింది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం… ఉత్తర్ ప్రదేశ్ అయోధ్యలోని బికాపూర్ ప్రాంతంలో ఓ జంట పెళ్లికి రెడీ అయింది. ఇక ముహూర్తానికి కొన్ని గంటల సమయమే ఉంది. ఇదే సమయంలో వరుడు.. కాబోయే భార్యకు జుట్టుకు తక్కువగా ఉందని, నేను ఆమెను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. వరుడి మాటలు విన్న వధువు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. అనంతరం వధువు కుటుంబ సభ్యులు వరుడికి రాత్రంతా నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఎంత వివరించినా.. వరుడు వెనక్కి తగ్గకపోగా.. పెళ్లి చేసుకోనని తేల్చిచెప్పేశాడు.
ఈ క్రమంలోనే వధువు, ఆమె కుటుంబ సభ్యులు… వెంటనే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. వరుడు అదనపు కట్నం డిమాండ్ చేస్తున్నాడని అతడిపై ఫిర్యాదు చేశారు. వధువు ఫిర్యాదు మేరకు వరుడు, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. కాబోయే భార్యకు జుట్టు తక్కువగా ఉందని పెళ్లికి నిరాకరించిన వరుడి నిర్ణయంపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.