ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు రూపొందించినా అమ్మాయిలపై అత్యాచార దాడులు మాత్రం అస్సలు ఆగడం లేదు. వావివరస లేకుండా కొందరు బరితెగించి ప్రవర్తిస్తూ లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే మగాళ్లు ఆడవాళ్లపై అత్యాచారాలు చేస్తుంటే కొత్తగా హిజ్రాలు కూడా బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతూ దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి ఘటనలోనే ఓ హిజ్రా ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడింది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఇది కూడా చదవండి: ఫస్ట్‌నైట్ రోజు భార్య ఓ కండిషన్.. విడాకులకు సిద్దమైన భర్త!
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర ప్రదేశ్ లోని బరేలీలో ఓ హిజ్రా నివసిస్తూ ఉండేది, అయితే పక్కింట్లో టీవీ చూస్తున్న ఏడేళ్ల బాలికపై ఆ హిజ్రా కన్నేసింది. ఆ బాలికను తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టింది. దీంతో అంతటితో ఆగకుండా ఎవరికైన చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు గురి చేసింది. దీంతో భయపడిపోయిన ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పకుండా ఉండిపోయింది. ఇక ఇటీవల ఆ బాలికకు కడుపులో నొప్పిగా ఉండడంతో తల్లిదండ్రులు డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. పరీక్షల అనంతరం వైద్యులు అసలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.