కామంతో కన్ను మిన్ను తెలియకుండా రెచ్చిపోతున్న వారు ఎక్కువై పోయారు. అలాంటి వారికి వయసుతో సంబంధం లేదు.. వావి వరస చూడరు.. ఆ క్షణానికి వారి కోరిక తీరిందా? లేదా? ఇప్పుడు సమాజంలో చూస్తున్న దారుణ ఘటనల్లో ఒకటి కన్న తండ్రే.. కుమార్తెను లైంగికంగా వేధిస్తుండటం. ఆ బాధను ఎవరితో పంచుకోవాలో తెలియక వారిలో వారు కుమిలిపోవడం. ఈ బాలికది కూడా అదే కన్నీటి గాథ.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురంలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల కూతురిపై కన్న తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక్క తండ్రే కాదు.. అతనితోపాటు చిన్నాన్న సైతం కొంత కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడనే వార్త.. స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తనపై తండ్రి, చిన్నాన్న లైంగిక దాడికి పాల్పడుతున్నారని బాధితురాలు తెలిపింది. కన్న తల్లికి ఈ విషయం చెప్పినా అమె బాలిక మాటలు పట్టించుకోలేదని సమాచారం.
ఏ కష్టం వచ్చినా ఆడపిల్ల తండ్రికి చెప్పుకుంటుంది. ఇక్కడ తండ్రే సమస్య కావడంతో తల్లి ముందు తన గోడును వెళ్లగక్కింది. ఆ తల్లి సరిగ్గా స్పందిచకపోవడంతో ఆమెకు దిక్కు తోచలేదు. తన కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. బాధితురాలు స్థానిక మహిళా పోలీసులను ఆశ్రయించింది. ఆ తర్వాతే ఆ రాక్షసుల వికృత చేష్టలు వెలుగు చూశాయి. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: మాజీ మంత్రి తనయుడి ఫామ్ హౌస్ వద్ద యువతి మృతదేహం!