సంతోషంగా సాగుతున్న వైవాహిక జీవితంలో వివాహేతర సంబంధాలు వచ్చి చేరి చిచ్చు రేపుతున్నాయి. కొంతమంది భర్తలు ఇంట్లో భార్యను కాదని పరాయి మహిళతో తెర చాటు సంసారాలకు అలవాటుపడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ భార్య భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. తాజాగా విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సాలూరు పట్టణం చిన్న హరిజన పేట లో సింగారపు తౌడు అనే వ్యక్తికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగింది. వీరికి కొంతకాలానికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.
భర్త ప్రభుత్వ ఉద్యోగి కావడంతో వీరి కాపురం సంతోషంగా సాగేది. కానీ రోజులు మారే కొద్ది భర్త బుద్ది మాత్రం వక్రమార్గం వైపు వెళ్లింది. అయితే గత కొన్ని రోజుల నుంచి భర్త మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని నడిపిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ విషయం కాస్త భార్య చెవిన పడింది. ఈ విషయంపై కొన్నాళ్లు భార్య కూడా చూసి చూడనట్లుగానే వదిలేసింది. కానీ రాను రాను భర్త బయటి కాపురం శృతిమించడంతో తౌడు భార్య తట్టుకోలేకపోయింది. ఇటీవల ఓ రోజు భర్త ప్రియురాలితో సరసాల్లో మునిగితేలుతున్నట్లు అనుమానం వచ్చింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దీంతో పక్కా ప్లాన్ తో వెళ్లిన భార్య భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇక వెంటనే భర్త ప్రియురాలిని బయటకు లాగి ఎడాపెడా వాతలు వాయించింది. ఈ విషయం స్థానిక పెద్దలకు తెలియడంతో పంచాయితీ పెట్టించి ఇద్దరికి సర్దిచెప్పి పంపించారు. ఇక దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కట్టుకున్న భార్యను కాదని పరాయి మహిళతో సరసాలు నడిపిన భర్త తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.