సమాజంలో వెలుగు చూస్తున్న తెరచాటు సంసారాల చిట్టా చూస్తుంటే.. ఛీఛీ అనక మానరు. వావి వరసలు, స్నేహ బంధాలను మరిచిపోయి బరితెగిస్తున్న వాళ్లను చూస్తుంటే కంపరం పుట్టక మానదు. అగ్ని సాక్షిగా తాళి కట్టిన భార్యను చిటికెలో మోసం చేస్తున్నారు. కలకాలం తోడుగా ఉండి బాగోగులు చూసుకోవాల్సిన భార్యే భర్తను కాటికి పంపుతోంది. అవసరం కోసం.. కామవాంఛలు తీర్చుకోవడానికి మాయమాటలు చెప్పే వారినే ఎక్కవగా నమ్మి మోసపోతున్నారు. క్షణకాల సుఖం కోసం నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు జిల్లా సేలంకు చెందిన కవిత, జీవా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వడ్రంగి పని చేస్తూ జీవా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా జీవా మందుకు బానిసయ్యాడు. రోజూ పని అయ్యాక తాగి ఇంటికి వెళ్లడం మొదలు పెట్టాడు. జనవరి 16న రోజుటిలాగానే తాగి వెళ్లిన జీవా.. అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కవితను విచారించారు. ఆమె తీరుపై వారికి అనుమానం కలిగింది. పోస్టుమార్టంలోనూ జీవా ఒంటిపై గాయాలున్నట్లు తేలింది. కవిత, జీవా మిత్రుడు రాజాను అనుమానితులుగా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
విచారణలో కవిత, రాజా సమాధానాలు చూసి పోలీసుల అనుమానం మరింత బలపడింది. కవిత ప్రతిసారి పొంతనలేని సమాధానాలు చెప్ప సాగింది. పోలీసులు డోసు పెంచడంతో అసలు విషయం బయటపడింది. కవిత- రాజా వివాహేతర సంబంధం గురించి జీవాకు తెలియడంతోనే అతని అడ్డు తొలగించుకున్నట్లు తెలిపారు. జీవాకు పులవరి ప్రాంతానికి చెందిన రాజా మంచి మిత్రుడు. రాజాకు పెళ్లైంది.. ముగ్గురు పిల్లలున్నారు. జీవనోపాధి కోసం ఆటో నడుపుతుంటాడు. స్నేహం పేరుతో రాజా తరచూ జీవా ఇంటికి వెళుతుండేవాడు.
ఇదీ చదవండి: 7 ఆర్ట్స్ సరయు కేసులో షాకింగ్ ట్విస్ట్! కాసేపట్లో..!
కవితపై రాజా కన్నుపడింది. ఆమె కూడా కనెక్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపింది. ఇద్దరి బుద్ధి వంకర కావడంతో త్వరగా కలిసిపోయారు. కవితతో ఎంజాయ్ చేసేందుకు సేలంలో ఓ ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నాడు రాజా. అప్పటి నుంచి జీవా లేని సమయంలో వారి కామవాంఛలు తీర్చుకోవడం మొదలు పెట్టారు. వారి చీకటి బంధం కొన్నాళ్లకు జీవాకు తెలిసింది. కవితను మందలించాడు. ఆ వంకతో పుట్టింటికి వెళ్లింది. ఆ సమయంలో రాజాను కలవడం ఇంకా సులువైంది.
ఇదీ చదవండి: పడక సుఖం కోసం ఐదుగురి ప్రాణాలు తీశారు!
అయినా వారు ఎలాంటి అడ్డు లేకుండా కలవాలంటే జీవాను హత్య చేయాలంటూ రాజాను ఉసిగొలిపింది. రాజా కూడా కవితతో పడక సుఖం మిస్ కాకూడదని భావించి.. అందుకు ఓకే చెప్పాడు. ఇద్దరూ కలిసి జనవరి 16న తాగొచ్చిన జీవాను కొట్టి.. ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నాటకం ఆడారు. విచారణలో అసలు విషయం తెలియడంతో కటకటాల పాలయ్యారు. స్నేహానికి విలువిచ్చి ఇంటికి రానివ్వడమే జీవా చేసిన తప్పు. ఫ్రెండ్ భార్య అని కూడా చూడకుండా కవితపై కన్నేయడం రాజా తప్పు. కట్టుకున్న భర్తను మోసం చేయకూడదనే ఇంకితాన్ని మరిచి కన్ను గీటగానే కొంగు జార్చుకున్న కవితది అందరికంటే పెద్ద తప్పు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.