అది తమిళనాడులోని కడలూరు జిల్లా తిరుపతి పుల్లియూర్ సమీపంలోని కుప్పంగుళం ప్రాంతం. కృష్ణన్ అనే వ్యక్తి అక్కడి ఏరియాలో చిన్నప్పటి నుంచే రౌడీ షీటర్ గా అందిరి నోళ్లలో మెదులుతున్నాడు. హత్యలు, కిడ్నాప్ తో స్వయంగా ఓ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని జనాన్ని వెంటేసుకుని తిరిగేవాడు. వీరి గ్యాంగ్ లో అరవింద్ అనే వ్యక్తి కృష్ణన్ కి నమ్మకమైన వ్యక్తిగా మెలిగేవాడు. ఏదైన కిడ్నాప్ చేయాలన్న అందులో అరవింద్ పాత్ర కచ్చితంగా ఉండాల్సిందే.
అయితే కొన్నాళ్లకి రౌడీ షీటర్ కృష్ణన్ గాంధీమతి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భర్త మాత్రం అదే రౌడీయిజాన్ని ప్రదర్శిస్తూ జైలుకు వెళ్తూ వస్తున్నాడు. అయితే ఓ హత్య కేసులో భాగంగా కృష్ణన్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే జైలు నుంచి తప్పించుకోవాలని చూసిన కృష్ణన్ ఎస్సై గొంతు కోసి పరారయ్యేందుకు ప్రయత్నాలు చేశాడు. దీంతో పోలీసులుబ అలెర్ట్ అయి ఈ రౌడీ షీటర్ ని ఎన్ కౌంటర్ లో లేపేశారు. ఇక అప్పటి నుంచి ఒంటిరిగా ఉంటున్న భార్య గాంధీమతి అతని శిష్యుడైన అరవింద్ తో సన్నిహితం పెంచుకుంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వారి సన్నిహితం రాను రాను వివాహేతర సంబంధంగా రూపుదాల్చింది. ఇక భర్త లేకపోవడంతో గాంధీమతి ఆ రౌడీ షీటర్ తో బెడ్ రూమ్ లో పట్టపగలే సరసాలు కొనసాగించేది. అలా కొంత కాలం వీరి చీకటి సంసారం బాగానే సాగింది. ఇక కొన్నాళ్లకి గాంధీమతి చేస్తున్న ఈ చీకటి కాపురం బయటపడడంతో భర్త కుటింబికులు పలుమార్లు హెచ్చరించారు. అయినా బుద్ది మార్చుకోకుండా ఏకంగా ఇంట్లోనే ప్రియుడు అరవింద్ తో రొమాన్స్ తెర లేపేది. దీంతో అత్తింటివాళ్లు అరవింద్ తో తిరగొద్దని గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో అతనితో తిరగడం, కలవడం పూర్తిగా మానేసింది.ఇక కొన్ని రోజుల తర్వాత గాంధీమతి మరోకడితో తిరుగుతున్నట్లు అరవింద్ కు తెలిసింది. ఇక కోపంతో రగిలిపోయిన ప్రియుడు అరవింద్ గాంధీమతిని హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు. సమయం కోసం ఎదురుచూస్తున్న అరవింద్ ఆ రోజు కూడా రానే వచ్చింది. ఓ రోజు రోడ్డుపై నడుచుకుంటు వెళ్తున్న ప్రియురాలు గాంధీమతిని అరవింద్ అడ్డగించి కత్తులతో నరికిచంపి పరారయ్యాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అరవింద్ తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.