శ్రీకాకుళం- ఈ మధ్య కాలంలో వ్యభిచార ముఠాలు ఒక్కొక్కటిగా పోలీసులకు చిక్కుతున్నాయి. ఒకప్పటిలా కాకుండా ఎవరికి ఏ మాత్రం అనుమానం రాకుండా, జనావాసం ఉండే ప్రాంతాల్లో దర్జాగా వ్యభిచారం దందాను నడుపుతన్నారు కొంత మంది. ఇదిగో శ్రీకాకుళం జిల్లాలో ఓ మహిళ నిర్వహిస్తున్న వ్యభిచార వ్యవహారాన్ని పోలీసులు కనిపెట్టేశారు.
సదరు మహిళ ఏకంగా తన ఇంటినే వ్యభిచార గృహంగా మార్చింది. పలు ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి గుట్టుగా వ్యభిచారం నడిపిస్తోంది. గత పదేళ్లుగా సాగుతున్న ఈ వ్యభిచార వ్యాపారానికి పోలీసులు చెక్ పెట్టారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేసి, మహిళతో పాటు నలుగురు యువకులను అరెస్ట్ చేశారు.
పాలకొండ పట్టణం గటాలడెప్పి వీధిలోని ఓ ఇంట్లో మహిళ తన ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తోంది. గత పదేళ్లుగా ఆమె ఈ వ్యవహారాన్ని గుట్టుగా నడిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యవహారం చక్కబెడుతోంది. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పాలకొండ ఎస్‌ఐ ప్రసాద్ తన సిబ్బందితో కలిసి ఆ ఇంటిపై దాడులు నిర్వహించారు.
సదరు ఇంట్లో ఓ మహిళ, నలుగురు యువకులు పట్టబడినట్లు ఎస్‌ఐ ప్రసాద్ చెప్పారు. యువకులపై కేసు నమోదు చేశామని, సంబంధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని తెలిపారు. వ్యభిచార గృహ నిర్వహకురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు.