కరోనా మహమ్మారి వచ్చాక పిల్లలకు ఇల్లే సర్వస్వం అయిపోయింది. ఎక్కడికి వెళ్లడానికి లేదు. పాఠాలు కూడా బడికి వెళ్లే పని లేకుండా ఇంట్లోనే ఉండి వినాల్సి వస్తోంది. పిల్లలు ఆ ఫోన్లకే అతుక్కుపోతున్నారు. అయితే ఈ ఆన్ లైన్ క్లాసులు వచ్చాక పిల్లలు చెడిపోతున్నారు.. ఫోన్లో ఏవేవో చూస్తున్నారని భయపడిపోతున్నారు. అయితే ఓ పంతులు చేసిన పని పిల్లల తల్లిదండ్రులను మరింత భయాందోళనకు గురి చేసింది. రాజస్థాన్ లో ఓ ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసే దాకా వెళ్లింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
విషయం ఏంటంటే.. ఎప్పటిలాగే స్కూల్ పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నాయి. ఓ ప్రబుద్ధుడు స్కూలుకు సంబంధించిన యాప్ లో ఓ పోర్న్ వీడియో లింకును షేర్ చేశాడు. ఆ లింకును చూసిన పిల్లలకు, తల్లిదండ్రులకు కాసేపు ఏమీ అర్థం కాలేదు. స్కూల్ యాప్ లోకి ఆ లింక్ ఎలా వచ్చిందని షాకయ్యారు. వెంటనే స్కూలు యాజమాన్యానికి విషయం చేరవేశారు. గమనించిన స్కూల్ యాజమాన్యం ఆ లింకును డిలీట్ చేసేందుకు ప్రయత్నించారు.
సర్వర్ బ్రేక్ కావడంతో ఎంత సేపటికి ఆ లింకు డిలీట్ కాలేదు. చాలాసేపు తిప్పలు పడ్డ తర్వాత ఆ లింకును స్కూల్ యాప్ నుంచి డిలీట్ చేయగలిగారు. ఈలోపు ఆ లింకును యాప్ లో ఉన్న అందరు తల్లిదండ్రులు, పిల్లలు చూశారు. సదరు ఉపాధ్యాడిపై చర్యలు తీసుకోవాలంటూ పిల్లల పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పంతులు చేసిన పాడు పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.