నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరంలో ఎస్సై వేధింపులు నానాటికి ఎక్కువవుతున్నాయి. ఇటీవల పేకాట కేసులో ఆ ఎస్సై నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ లో భాగంగా వీరిని విచారణ పేరుతో వీరిని తీవ్ర హింసకు గురి చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆ మండల పోలీసుల వేధింపులు తాళలేక చెంచయ్య అనే వ్యక్తి మరణించాడు.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల చెంచయ్యతో సహ నలుగురిని పేకాట కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అనంతరం ప్రతీ రోజు స్టేషన్ కు పిలిపించి విచారణ పేరుతో నానా హింసలకు గురి చేసేవాడట. అందులో భాగంగానే బుచ్యయ్య అనే వ్యక్తి పోలీసుల వేధింపులకు తాళలేక పోలీసు స్టేషన్ కు వెళ్తున్న క్రమంలో స్టేషన్ ముందే కుప్పకూలి మరణించాడు. చెంచయ్య మరణంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
స్థానిక పోలీసులు, ఎస్సై వేధింపుల వల్లే బుచ్చయ్య మరణించాడని బంధువులు, స్థానిక ప్రజా సంఘాల నాయకులు అరోపిస్తున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా ఆయన శవాన్ని స్టేషన్ ముందు ఉంచి ధర్నాకు దిగారు. గత కొన్నేళ్ల నుంచి మర్రిపాడు మండలం ఎస్సై బరితెగించి ప్రవర్తిస్తూ విచారణకు వచ్చిన అనేక మందిని తీవ్ర హింసకు గురిచేస్తున్నారని స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చేపట్టారు. వెంటనే అతనిని విధుల నుంచి తొలగిస్తూ వెంటనే సస్పెండ్ చేయాలని లేకుండా ఉద్యమం తీవ్ర తరం చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.