తెలంగాణలో కుంభమేళగా చెప్పుకునే మేడారం జాతర మొదలైంది. జాతర మొదలైన గత మూడు రోజుల నుంచి భక్తుల వాహనాలతో రోడ్డు మరింత రద్దీగా మారింది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి. తాజాగా ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం మేడారం జాతరకు వెళ్లే మార్గంలో గట్టమ్మ ఆలయం సమీపంలో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వరంగల్ వైపు నుంచి మేడారం వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి కావడంతో గత నెల రోజులుగా ఈ మార్గం నిత్యం రద్దీగా ఉంటోంది.
ఇది చదవండి: బస్తా నిండా చిల్లర తీసుకెళ్లి స్కూటర్ కొనుగోలు… వీడియో వైరల్!
ఈ స్థాయిలో ప్రాణనష్టం జరగడం ఇదే తొలిసారి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ములుగు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు మేడారం జాతరకు ఈ రోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ క్రమబద్దీకరిచేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.