సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. మనిషి మేధస్సు అంతరిక్షాన్ని ఏలుతోంది. కానీ, మూఢనమ్మకాలు ఇంకా మానవ మెదడు నుంచి తొలగిపోవడం లేదు. ఏదొకమూల చేతబడి, బాణామతి నెపంతో దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎవరో ఒకరు అందుకు బలవుతూనే ఉన్నారు. తాజాగా దంపతులను బాణామతి వంకతో విచక్షణారహితంగా స్తంభానికి కట్టేసి కొట్టారు. అదికూడా వేరెవరో కాదు.. తమ సొంత బంధువులే అలా చేశారు. గ్రామస్థులు కూడా వారిని నిలువరించలేక చూస్తుండిపోయారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఈ అమానవీయ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలో వెలుగు చూసింది. అల్లాదుర్గానికి చెందిన రమేశ్, రజిత దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఓ రోజు సమీప బంధువులు వారి ఇంటికి వచ్చారు. కాసేపు కూర్చుకుని అందరూ మాట్లాడుకున్నారు. వారి సంభాషణల్లో ఏం జరిగిందో.. ఏమో. వెంటనే రమేశ్, రజితలను బయకు లాక్కొచ్చారు. అక్కడున్న విద్యుత్ స్తంభానికి కట్టేశారు. వారిని విపరీతంగా కొట్టడం మొదలు పెట్టారు. ఆ గ్రామస్థులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వారు బాణామతి చేస్తున్నారంటూ ఆరోపించారు. అందరూ చూస్తుండగానే వారిని విపరీతంగా కొట్టారు.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దాడి చేస్తున్నవారిని అడ్డుకున్నారు. రమేశ్- రజితలను వైద్యం అందించేందుకు ఆస్పత్రికి తరలించారు. ఆందోళనలు జరిగే అవకాశం ఉందని.. ఆ గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ఇలాంటి వాటిపై అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. కానీ, ఎక్కడో ఒకచోట ఇలాంటి దాడులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మంత్రాల నెపంతో హత్యలు చేస్తున్న ఘటనలు కూడా చూస్తున్నాం. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: భర్తని మోసం చేసి మామతో! మామకి తెలిసే మరో యువకుడితో! ఈమె ఆడదేనా?