పరువు.. సమాజంలో కొంతమంది దీని కోసం దేనికైన తెగిస్తారు. ఓ పూట తిండి లేకపోయిన పర్వాలేదు. కానీ.. అదే పరువు కరిగిపోతుందంటే మాత్రం వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఇదే తరహాలో మహారాష్ట్రలోని ఓ తల్లీకొడుకు పరువు ఏకంగా సొంత చెల్లిని దారుణంగా హత్య చేశారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఓ తల్లీకుమారుడితో పాటు కీర్తిథోర్ అనే కూతురు నివాసం ఉంటున్నారు.
అయితే 19 ఏళ్ల వయసున్న కూతురు కీర్తిథోర్ స్థానికంగా ఉండే ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. ఆ యువకుడితో ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవడం తల్లీకొడుకు నచ్చలేదు. కొన్ని రోజులు కీర్తిథోర్ కి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా తీరు మార్చుకోక మనసు పడ్డ యువకుడితోనే ప్రేమ వివాహం చేసుకుని ఇంటికి దూరంగా కాపురం పెట్టింది. ఇక కొన్ని రోజుల తర్వాత కీర్తిథోర్ తల్లి ఇటీవల కూతురి ఇంటికి వచ్చింది. అర్థం చేసుకున్నారని కూతురు కీర్తిథోర్ సంతోషపడింది.
మరికొన్ని రోజుల తర్వాత కీర్తిథోర్ తల్లితో పాటు సోదరుడిని వెంట పెట్టుకుని కూతురి ఇంటికి వచ్చింది. తన చెల్లెల లవ్ మ్యారేజ్ చేసుకోవడం తన అన్నకు నచ్చలేదు. అప్పటి నుంచి కీర్తిథోర్ పై పగతోనే ఉన్నాడు. అయితే చాలా ఏళ్ల తర్వాత తన అన్నా, తల్లి రావడంతో కీర్తిథోర్ ఎంతో సంతోషపడింది. ఇంతలో కడుపులో విషాన్ని నింపుకున్న తల్లీకొడుకుని కీర్తిథోర్ గ్రహించలేకపోయింది. ఎలాగైన కీర్తిథోర్ ను హత్య చేయాలని తల్లీకొడుకు భావించి అదే పనిగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అత్తా మామలు ఇంట్లో లేకపోవడంతో తల్లీకొడుకు కూతురు కీర్తిథోర్ తల నరికి దారుణంగా హత్య చేశారు.
ఇక నరికిన తలను బయటకు తీసుకువచ్చి పైశాచిక ఆనందాన్ని పొందుతూ సోదరి తలతో సెల్ఫీలు తీసుకున్నారు. ఇక వెంటనే అలెర్ట్ అయిన స్థానికులు ఏం జరిగిందని చూసే సరికి కీర్తిథోర్ రక్తపు మడుగులో పడి విలవిల కొట్టుకుంటుంది. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పరువు కోసం సొంత అన్న, తల్లి దారుణంగా హత్య చేసిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.