‘కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మి, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ’ అనే శ్లోకం వినే ఉంటారు. భార్య.. పనిలో దాసిగా, సలహాలివ్వండలో మంత్రిగా, భోజనం పెట్టడంలో తల్లిగా, అందంలో లక్ష్మిగా, పడక గదిలో రంభగా, క్షమాగుణంలో భూదేవిగా ఉండాలి అంటారు. కానీ, కొందరు మహిళలు మాత్రం అవన్నీ గాలికి వదిలేసి.. ఇష్టారీతిన ఉండటం, కట్టుకున్న భర్తను నానా హింసలు పెట్టడం చేస్తున్నారు. తాజాగా ఓ భార్య చేసిన పని అందరినీ షాక్ కు గురిచేసింది. భర్తకు అలాంటి ద్రోహం ఎందుకు చేసిందా అని ముక్కున వేలేసుకుంటున్నారు. అతను తినే ఆహారం, తాగే నీళ్లలో కోన్నేళ్లుగా ఏవో ట్యాబ్లెట్లు కలపుతూ ఉంది. ఆ విషయం తెలుసుకునేందుకు భర్తకు చానాళ్లే పట్టింది.
వివరాల్లోకి వెళితే.. కేరళ కొట్టాయం జిల్లాలోని పాలా పట్టణంలో సతీష్ అతని భార్య ఆశ నివాసముంటున్నారు. వారికి 2006లో వివాహం జరిగింది. సతీష్ ఒక ఐస్ క్రీమ్ పరిశ్రమలో పనిచేస్తుంటాడు. వారు పాలక్కాడ్ లో ఓ ఇల్లు కూడా కొన్నారు. కానీ, ఆశ ఎందుకో సతీష్ తో తరచూ గొడవలు పడేది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తుండేది. అయితే, గత కొన్ని రోజులుగా సతీష్ ఊరికే నీరసానికి గురవ్వడం, త్వరగా అలిసిపోవడం జరుగుతోంది. ఎందుకిలా జరుగుతోందని వైద్యుడిని సంప్రదించాడు. అయితే షుగర్ లెవల్స్ తగ్గడం వల్లే అలా జరిగిందని వైద్యుడు తెలిపాడు.
సతీశ్ యాధృచ్ఛికంగానో.. కావాలనో సెప్టెంబర్ 2021 నుంచి ఇంట్లో ఆహారం తినడం మానేశాడు. అతని ఆరోగ్యం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. అయితే అప్పటి నుంచి సతీశ్ కు తన భార్యపై అనుమానం మొదలైంది. తన భార్యే తనను ఏదో చేసిందనే నిర్ణయానికి వచ్చాడు. అయితే అందుకు సంబంధించి ఎలాంటి ఆధారం అతని వద్ద లేదు. తన స్నేహితుడిని ఆ పనికి పురమాయించాడు. ఎలాగైనా తన భార్య ఏంచేస్తోందో తెలుసుకోవాల్సిందిగా కోరాడు. తన మిత్రుడు ఆశను మాటల్లో పెట్టి అసలు విషయాన్ని కూపీ లాగాడు. ఆమె తన భర్త తినే ఆహారం, తాగే నీళ్లలో ఏవో ట్యాబ్లెట్స్ కలుపుతున్నట్లు ఒప్పుకుంది. ఆ వివరాలు కూడా చాటింగ్ లో చెప్పేసింది.
అంతేకాదు తమ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా.. భార్య ఆహారంలో ఏదో కలుపుతున్న విషయం నిజమని తేలింది. సతీష్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య చేసిన మొత్తం నిర్వాకాన్ని ఆధారాలతో సహా పోలీసుల ముందు పెట్టాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు. అసలు ఆమె ఎందుకు ఇలా చేసిందనేది మాత్రం పూర్తి విచారణ తర్వాతే తెలుస్తుంది. ఈ భార్య చేసిన నిర్వాకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.