అమ్మతనానికి మాయని మచ్చ తెచ్చింది ఈ యువతి. నెల కూడా నిండని కన్న బిడ్డను అత్యంత పాశవికంగా చంపింది. బిడ్డ ఏడుపు భరించలేకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఈ అమానవీయ ఘటన కేరళలోని పతనంతిట్టలో చోటుచేసుకుంది. డిసెంబరు 9న బిడ్డ ఏడుస్తోందని మహిళ ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు ఇచ్చిన మందులు తీసుకుని వచ్చింది. ఇంటికి వచ్చాక ఆ బిడ్డ పరిస్థితి ఇంకా విషమించడంతో తాలూకా ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటిని ఆ పసికందు కన్ను మూసింది. ఆ తర్వాత స్థానికుల వాగ్మూలం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.
పోస్టుమార్టంలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. చిన్నారి తల వెనుక గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తల్లిని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకపోవడంతో పోలీసులకు అనుమానం పెరిగింది. తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు నిజాలు వెలుగు చూశాయి. ఆ యువతి కొట్టాయంలోని ఓ ప్రైవేటు ఇన్ స్టిట్యూట్ లో చదువుతోంది. ఒక వ్యక్తితో కలిసి ఆశ్రమంలో ఉంటోంది. అతనికి ముందే పెళ్లైంది. అతనితో ఫోన్లో మాట్లాడుతూనే అనారోగ్యంతో బాధపుడుతున్న చిన్నారిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఈ మహాతల్లి చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.