ఈ మద్య భారత దేశంలో మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయని ప్రతిరోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కానీ కొన్ని చోట్ల మాత్రం మహిళలే పురుషులను హత్య చేయడం.. హత్యాయత్నాలు చేసిన ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. మంగళవారం ఉదయం హర్యానాలోని గురుగావ్ సైబర్ సిటీ ఏరియా ఒక ఘటన సంచలనం సృష్టించింది. బురఖా ధరించిన ఓ మహిళ క్యాబ్ బుక్ చేసుకుంది. ఆ తర్వాత క్యాబ్ డ్రైవర్‌పై బురఖా ధరించిన మహిళ కత్తితో దాడిచేసింది. అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు ఆమెను పట్టుకున్నారు. ఈ ఘటనలో క్యాబ్ డ్రైవర్ రఘురాజ్ గాయపడ్డాడు.
ఇది చదవండి: మంచం పట్టిన 87 ఏళ్ల ముసలమ్మపై కామవాంఛ! వీడు మనిషేనా?
క్యాబ్ డ్రైవర్ కథనం ప్రకారం.. ఓ మహిళ తన క్యాబ్ బుక్ చేసుకుందని.. అక్కడి వెళ్లిన తర్వాత బురఖా ధరించిన ఆ మహిళ తనపై కత్తితో దాడి చేసిందని అన్నాడు. సడెన్ గా తనపై దాడి చేయడంతో తాను ఏమీ చేయలేకపోయానని.. తనపై దాడి చేసిన తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించిందని అన్నాడు. తనకు గాయాలు అయినా తనని ఛేజ్ చేశానని… అదే సమయంలో పీసీఆర్ వ్యాన్ ఈ విషయం గ్రహించి పారిపోతున్న మహిళను పట్టుకుందని అన్నాడు. రఘురాజ్ పై దాడికి పాల్పడిన మహిళలను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఆమె విదేశీయురాలని తెలుస్తోందని, అయితే ఆమె పూర్తి వివరాలు ఇంకా నిర్ధారించాల్సి ఉందని చెప్పారు.