ప్రస్తుతం సభ్య సమాజంలో ఎంతో మంది అసాంఘిక, అనైతిక, అక్రమ సంబంధాలు పెట్టుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అంతేకాదు.. వారిని నమ్మిన వారి జీవితాలను కూడా సగంలోనే ముక్కలు చేస్తున్నారు. పడక సుఖం కోసం జీవిత భాగస్వాములను కూడా అంతమొందిస్తున్నారు. ప్రియుడితో జీవితాన్ని ఎంజాయ్ చేయచ్చని భ్రమలో హత్య చేసి.. ఆ తర్వాత కటకటాల పాలవుతున్నారు. అలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. ఓ రోజు భర్త తన ఇంట్లో చూడకూడనిది చూశాడు. అదే అతని పాలిట శాపంగా మారింది. తన భార్య ప్రియుడి ఒడిలో ఒదిగి రొమాన్స్ చేస్తుండగా భర్త కంటపడింది. ప్రియుడిని కలవనీకుండా చేస్తున్నాడని.. ఐదు నిమిషాల సుఖంకోసం భర్తనే కడతేర్చింది. ఆ తర్వాత ఓ డ్రామా కూడా వేసింది. కానీ అడ్డంగా దొరికిపోయింది.
ఇదీ చదవండి: భర్త కళ్ళ ముందే భార్యకి అవమానం..! కుర్రాళ్లంతా కలిసి!
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా నగరం మండలం కాసరవారిపాలెంకు చెందిన కర్రి వెంకటేశ్వరరావుకు రేపెల్లె మండలం బండికాయలమోతు గ్రామానికి చెందిన ఆదిలక్ష్మిని వివాహం చేసకున్నాడు. వారికి 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. జీవితం సజావుగా సాగిపోతోంది. కూలినాలి చేసి ఆదిలక్ష్మిని పోషిస్తున్నాడు. కొన్నాళ్లు అంతా బాగానే నడిచింది. కానీ, బెజ్జం రాజేశ్ అనే పాత్ర వారి జీవితంలోకి ఎంటర్ అయ్యాక అంతా మారిపోయింది. రాజేశ్ కు ఆదిలక్ష్మితో పరిచయం ఏర్పడింది. వారిమధ్య చనువు పెరిగింది. ఆదిలక్ష్మిని సులువుగా రాజేశ్ వలలో వేసుకున్నాడు.
రానురాను వారి చర్యలు శ్రుతిమించాయి. వారి మధ్య చనువు కాస్తా శారీరక సంబంధానికి దారి తీసింది. ఆదిలక్ష్మి.. రాజేశ్ తో అక్రమసంబంధానికి సై అనేసింది. వెంకటేశ్వరరావు ఇంట్లో లోని సమయంలో రాజేశ్ ను పిలిపించుకుని తన పడక సుఖాలను తీర్చుకోవడం చేసేది. ఓ రోజు వారి బండారం బయట పడింది. రాజేశ్ ఒడిలో ఓలలాడుతూ ఉన్న ఆదిలక్ష్మిని చూసి వెంకటేశ్వరరావు షాకయ్యాడు. వెంటనే విషయాన్ని పంచాయితీలో పెట్టాడు. పెద్దలు బుద్ధి చెప్పారు. అప్పటి నుంచి వెంకటేశ్వరరావు.. ఆదిలక్ష్మిని కట్టడి చేయడం మొదలు పెట్టాడు. తన ప్రియుడిని కలిసే వీలు లేకుండా చేశాడు. కొన్నాళ్లకు ఆదిలక్ష్మికి జీవితంపై విరక్తి పుట్టింది. తన ప్రియుడు రాజేశ్ కు తనకు మధ్యలో అడ్డుగా ఉన్న వెంకటేశ్రవరరావు అడ్డుతొలగించుకోవాలనుకుంది.
ఇదీ చదవండి: యువతిని బందీగా చేసుకున్న బాబా! తల్లిదండ్రుల ముందే..!
తన సుఖానికి అడ్డొస్తున్న వెంకటేశ్వరరావు హత్యకు పథకం పన్నింది. కొన్నాళ్లు మారిపోయినట్లు నటించింది. భర్తను, ఇరుగుపొరుగు వారిని నమ్మించింది. ఆ తర్వాత ఓ రోజు రాత్రి భర్త తినే భోజనంలో విషం కలిపి పెట్టింది. అది తిన్న వెంకటేశ్వరరావు మరణించాడు. ఆ తర్వాత ప్రియుడి సాయంతో అతని మృతదేహాన్ని ఇంట్లోనే గొయ్యి తీసి పాతిపెట్టింది. ఆ తర్వాత అసలు డ్రామా మొదలు పెట్టింది. తన భర్త కనిపించడం లేదని తెగ హడావుడి చేసింది. బంధువులు అందరినీ కలిసి భర్త కనిపించడం లేదని చెప్పుకొచ్చింది. పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. తన భర్త ఆచూకీ ఎలాగైనా కనిపెట్టండి అంటూ కాళ్లా వేళ్లా పడింది.
పోలీసులు విచారణ మొదలు పెట్టారు. నాలుగు రోజులు గడిచినా అతని ఆచూకీ దొరకలేదు. ఎక్కడి వెళ్లాడు, ఏమైపోయాడు అని తెలియరాలేదు. చుట్టుపక్కల వారిని విచారణ చేసినా కూడా ఎవ్వరూ వెంకటేశ్వరరావుని చూసినట్లు చెప్పలేదు. పోలీసులకు భార్య మీదే అనుమానం మొదలైంది. గతంలో ఆమెకు రాజేశ్ కు ఉన్న చీకటి బంధం గురించి కూడా పోలీసులకు తెలిసింది. నాలుగు రోజుల్లో ఆదిలక్ష్మి ఇంటినుంచి దుర్వాసన రావడం మొదలైంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తవ్వి చూడగా వెంకటేశ్వరరావు శవం లభించింది. భార్యను విచారణ చేయగా ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: చిన్నారిని ఎత్తుకెళ్ళి.. నరకం చూపించారు! వీళ్ళు మనుషులేనా?
లేటెస్ట్ అప్డేట్స్ కి SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.