గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువకుడి సెల్ఫీ వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. తాను ఓ అమ్మాయి ప్రేమించి మోసపోయానని.. ఆమెకు మరో ఇద్దరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వీడియోలోని వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన సంజయ్ అనే వ్యక్తి కష్టపడి చదివి పోలీసు కావాలనుకున్నాడు. సీఎం జగన్ కు ఎస్కార్ట్ గా చేయాలని కలలకు కన్నాడు. అయితే అతను నిరీషా అనే అమ్మాయి ప్రేమించాడు. ఏపీఎస్పీ క్యాంపులో పనిచేసే వ్యక్తి, గోలి నిరీషా, సుజాత అనే అమ్మాయిలే తన చావుకు కారణం అంటూ చెప్పుకొచ్చాడు. పోలీసు అయ్యి తన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కలలుకన్న తన జీవితం నాశనం చేశారన్నాడు. ఇలాంటి వాళ్లు మరో పుల్వామా, ముంబై అటాక్స్ జరిగేలా చేస్తారన్నాడు. వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరాడు.