ఈ మద్య కొంత మంది డబ్బు సంపాదించడం కోసం ఎదుటి వారి ప్రాణాలో పోయినా లేక్కబెట్టడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కొంత మంది కేటుగాళ్లు కల్తీ మద్యం, కల్తీ కల్లు విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. అలాంటి మద్యం తాగిన వారు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
రాజవొమ్మంగి మండలంలోని లోదొడ్డి గిరిజన గ్రామంలో కల్తీ జీలుగు కల్లు తాగి ఐదుగురు గిరిజనులు మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని పోలీసులు కల్లు శాంపిల్స్ ను సేకరించారు. మృతులు గంగరాజు, లోవరాజు, సన్యాసయ్య, సుగ్రీవు, ఏసుబాబుగా పోలీసులు గుర్తించారు. అయితే ఒకేసారి ఐదుగురు గ్రామస్తులు కల్తీ కల్లు తాగి మరణించడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకొని నింధితులపై చర్యలు తీసకుంటామని పోలీసులు చెబుతున్నారు.