నమ్మించి మోసాలు చేయటం ఈ మధ్య బాగా పెరిగిపోయింది. శారీరక సుఖం కోసం కొందరు వ్యక్తులు మరీ దారుణాలకు పాల్పడుతున్నారు. వల వేసి మరీ ఆడవాళ్లను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఓ యువకుడ్ని నమ్మి ఓ మహిళ మోసపోయింది. అత్యాచారానికి గురైంది. అతడిపై పగ పెంచుకుని భర్తతో కలిసి ప్లాన్ ప్రకారం దెబ్బతీసింది. కథ అంతటితో ఆగలేదు.. చివరకు ఏమైందో తెలుసుకోవాలంటే మొత్తం వార్త చదవండి.. రాజస్తాన్‌లోని జైపూర్‌కు చెందిన ఓ మహిళ అక్కడి విమానాశ్రయంలో పనిచేస్తోంది. అక్కడే పని చేస్తున్న ఓ యువకుడు శుభమ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది.
అతడికి జ్యోతిష్యం బాగా తెల్సని ఆమెను నమ్మించాడు. నగ్నంగా ఉన్న ఫొటో పంపితే జ్యోతిష్యం చెబుతానని అన్నాడు. అతడ్ని నమ్మిన ఆమె తన నగ్న ఫొటోను పంపింది. ఆ ఫొటోను అడ్డం పెట్టుకుని శుభమ్ బెదిరింపులకు దిగాడు. ఆ ఫొటోను నెట్‌లో పెడతానని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పింది. దీంతో ఆమె భర్త శుభమ్‌పై కక్ష గట్టాడు. ఎలాగైనా అతడ్ని దెబ్బతీయాలని ప్లాన్ వేశాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి శుభమ్‌ను కిడ్నాప్ చేశాడు.
ఒక రోజంతా అతడికి తిండి పెట్టకుండా చితకబాదారు. అనంతరం గుండు కూడా కొట్టించి వదిలేశారు. శుభమ్ కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత బాధితురాలి కుటుంబసభ్యులుకూడా పోలీసులను ఆశ్రయించారు. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఇరువురిపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు అందర్నీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.