పెళ్లికి ముందు ప్రేమలు ఫలించటమే చాలా కష్టంగా ఉంది ఈ కాలంలో. ఇక పెళ్లి తర్వాత ప్రేమల సంగతి అయితే, మరీ కష్టం. ఎక్కడో ఒకటో రెండో ఫలిస్తున్నాయి. ఇలాంటి టైంలో పెళ్లైన ఓ వ్యక్తి ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోవటానికి చాలా ప్రయత్నాలే చేశాడు. అవి విఫలమవ్వటంతో భరించలేకపోయాడు. చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రంపచోడవరానికి చెందిన సురేష్ అనే వ్యక్తి 2009లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా సెలెక్ట్ అయ్యాడు. ప్రస్తుతం విశాఖపట్నంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. సురేష్‌కు 2016లో తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన సునీతతో వివాహమైంది.
వీరికి ఓ పాప కూడా ఉంది. కొన్ని నెలల క్రితం అతడికి సునీత అనే యువతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తన ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలని భావించాడు. ఈ ఏడాది జనవరి నెలలో తన ప్రేమ విషయాన్ని భార్యకు చెప్పాడు. రెండో పెళ్లికి ఒప్పుకోమని అడిగాడు. భర్త రెండో పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత సునీత, సురేష్ భార్యకు ఫోన్ చేసి, తాను సురేష్‌ను ప్రేమించటం లేదని చెప్పింది. ఈ టైంలో ఇద్దరి మధ్యా స్పల్ప వాగ్వివాదం జరిగింది. అదే రోజు రాత్రి 11 గంటల టైంలో సురేష్ భార్యకు ఫోన్ చేశాడు. తాను ప్రేమించిన సునీత తనను తిరస్కరించిందని, ఆత్మహత్య చేసుకుంటున్నాని చెప్పాడు.
ఆ ఫొటోను భార్యకు పంపాడు. కొద్దిసేపటికే ఫొన్ కట్ అయింది. భార్య ఫోన్‌లో ఎంత ప్రయత్నించినా అవతలినుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అప్రమత్తమైన ఆమె ఎదుటి ఫ్లాట్‌లో ఉండే వారికి విషయం చెప్పింది. వారు ఇంట్లోకి వెళ్లి చూడగా.. సురేష్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అతడ్ని కిందకు దించి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చేర్చుకోకపోవటంతో కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. సురేష్‌ను పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు తేల్చారు. సురేష్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.