నేటికాలంలో జరుగుతున్న అనేక హత్యల్లో ఆర్థిక, వివాహేతర సంబంధాల కారణంగా జరిగేవే ఎక్కువ ఉన్నాయి. మరీ దారుణం ఏమిటంటే వివాహేతర సంబంధాల కారణంగా జరిగే హత్యలు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోతున్నాయి. దంపతులు ఒకరికి తెలియకుండా మరొకరు పరాయి వారితో పడక సుఖం కోసం చూస్తుంటారు. ఈ క్రమంలో తమ అక్రమ సంబంధానికి భాగస్వామి అడ్డుగా వస్తున్నారని హత్య చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ విధంగా కొన్ని జరుగుతుంటే అనుమానంతో భార్యలను హత్య చేస్తున్న కసాయి భర్తల కూడా ఉన్నారు. ఓ వ్యక్తి.. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. ఓ యువకుడిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆ యువకుడి శరీరాన్ని 15 ముక్కులుగా నరికాడు. ఈ ఘోరమైన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన గాజియాబాద్ జిల్లాలోని ఓ ప్రాంతంలో మిహ్లాల్(40), పూనమ్ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. మిహ్లాల్ కు పూనమ్ రెండో భార్య. అతడు రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెళ్లైన తరువాత కొంతకాలం పాటు వీరి సంసారం హాయిగా సాగింది. వీరికి ఇంటికి సమీపంలోనే అక్షయ్(24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఆ యువకుడితో మిహ్లాల్ కు స్నేహం ఏర్పడింది. అప్పుడప్పుడు మిహ్లాల్ ఇంటికి అక్షయ్ వస్తూ ఉండే వాడు. ఈ క్రమంలోనే పూనమ్ తో అక్షయ్ మాట్లాడుతుండే వాడని స్థానికులు అంటున్నారు.అయితే మిహ్లాల్ గత కొద్ది రోజులుగా భార్య పూనమ్ పై అనుమానం పెంచుకున్నాడు. తన స్నేహితుడితో పూనమ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లుగా భావించాడు.
మిహ్లల్ స్నేహితుడికి, పూనమ్ కి మధ్య వివాహేతర సంబంధం ఉందని స్థానికులు ఉంటున్నారు. తమ దంపతుల మధ్య గొడవలకు తన స్నేహితుడినే కారణమని మిహ్లాల్ అనుమానించాడు. దీంతో అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. తన ప్రణాళిక ప్రకారం.. అదును చూసి అక్షయ్ ను హత్య చేశాడు. హత్య విషయం బయకు రాకుండా ఉండేందుకు యువకుడి శరీరాన్ని 15 ముక్కలుగా నరికాడు. అనంతరం ఆ శరీర భాగాలను మూడు బ్యాగ్స్ లో అమర్చి.. సమీపంలోని కాలువ పక్కన పడేశాడు. శనివారం స్థానికులకు దుర్వాసన వస్తుండటంతో అటుగా వెళ్లి.. ముక్కలుగా ఉన్న మనిషి శరీర భాగాలను గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుడు రాజస్థాన్ లోని కోట్ పుట్లి అనే ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మిహ్లాల్ పై అనుమానంతో అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. పోలీసులు తమదైన శైలిలో మిహ్లాల్ ను ప్రశ్నించగా.. తానే ఈ హత్య చేసినట్లు అంగీకరించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి, జైలుకు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. మరి.. అనుమానం కారణంగా ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.