ఈ మధ్యకాలంలో బాలికలపై అత్యాచారాలు నానాటికి పెరిగిపోతు మగాళ్లు మృగాళ్లా తయారవుతున్నారు. ఇటు మూడేళ్ల బాలిక నుంచి అటు 90 ఏళ్ల ముసలవ్వల వరకు ఎవరినీ కూడా వదలకుండా అత్యాచారాలకు పాల్పడుతూ దారుణాలకు తెగబడుతున్నారు. ఇలాంటి వేధింపులను భరించేలేని ఓ 17 ఏళ్ల బాలిక చెన్నైలో బలవన్మరణానికి పాల్పడడం స్థానికంగా సంచలనంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నై పరిధిలోని మంగాడులో ఓ బాలిక తల్లిదండ్రుల వద్దే ఉంటూ స్థానిక పుందపల్లి ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. హాపీగా సాగుతున్న ఆమె జీవితంలోకి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. అవి రోజు రోజుకు మితిమీరటంతో ఏం చేయాలో తెలియక ఆ బాలిక కొంత కాలం తల్లిడిల్లిపోయింది. లైంగిక వేధింపులు ఎక్కువవడంతో ఆ బాలిక భరించలేక ఊహించని నిర్ణయం తీసుకుంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇటీవల ఇంట్లో సూసైడ్ రాస్తూ.. ఈ సమాజంలో ఉన్న ఆడపిల్లలకు తల్లి గర్భం, శ్మశానంలో తప్పా ఎక్కడ రక్షణ లేదంటూ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకుంది. ఇక విషయం పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ బాలిక రాసిన సూసైడ్ నోట్ చదివిన పోలీసులు, స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచనలంగా మారింది. లైంగిక వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడిన అభం శుభం తెలియని ఈ బాలిక ఆత్మహత్యపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.