తండ్రికి కూతురిపై ఉండే ప్రేమను మాటల్లో చెప్పలేం. కుమార్తె కాలు కూడా కిందపెట్టకుండా చూసుకుంటాడు. కానీ, అందరు తండ్రులు అలాగే ఉండరు. కొందరు ఇప్పుడు చెప్పుకోబోయే కిరాతకులు కూడా ఉంటారు. కన్న కూతురు ప్రేమలో పడిందని ఆ తండ్రి ఆమెపై కక్ష గట్టాడు. ఆమెకు ఇష్టం లేకుండా పెళ్లి చేయాలని ప్రయత్నించాడు. ఆమె పెళ్లికి ఒప్పుకోలేదని అత్యంత దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. బిహార్ రాష్ట్రం గోపాల్ గంజ్ జిల్లా కాట్వా గ్రామంలో ఇంద్రదేవ్ తన భార్య, కుమార్తెతో నివాసముంటున్నాడు. మొదట్లో కిరణ్ కుమారి(19)పై ఎంతో ప్రేమ చూపించేవాడు. ఆమె ఓ యువకుడితో స్నేహం చేసింది. ఆ తర్వాత వారి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఆ విషయం ఆ నోటా ఈ నోటా పాకి ఇంద్రదేవ్ కు తెలిసింది. కూతురిపై కోపంతో రంకెలేశాడు. అలాంటి పనులు చేస్తావా అంటూ మందలించాడు. అక్కడితో ఆగకుండా ఓ సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధమైపోయాడు. అందుకు కిరణ్ ససేమిరా అంది. ప్రేమించిన యువకుడినే పెళ్లాడతానంటూ భీష్మించుకు కూర్చుంది.
కుమార్తె ప్రవర్తనతో ఇంద్రదేవ్ ఎంతగానో విసిగిపోయాడు. తన కుమార్తె ప్రేమ పెళ్లి చేసుకుంటే ఊరిలో తన పరువు మొత్తం పోతుందనే భావన మొదలైంది. పెళ్లి చేసుకోవాల్సిందేనని ఒత్తిడి చేశాడు. ఆమె అయినా ఒప్పుకోక పోయేసరికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. కూతురు ప్రేమ పెళ్లి చేసుకోకుండా ఎలాగైనా ఆపాలని నిర్ణయించుకున్నాడు. ఇంద్రదేవ్ ఆదివారం రాత్రి పూటుగా మద్యం సేవించాడు. ఆ తర్వాత తన సోదరులతో కలిసి కుమార్తె గదిలోకి వెళ్లాడు. నిద్రపోతున్న కిరణ్ కుమారి కాళ్లు, చేతులు కట్టేశాడు. ఆ తర్వాత పదునైన కత్తితో ఆమె గొంతు కోశాడు. ఆమె తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ఇదీ చదవండి: విద్యార్థిని తప్పు చేస్తూ దొరికిపోయింది.. అవమానం తట్టుకోలేనంటూ..
ఆ తర్వాత మృతదేహం ఎవరికీ కనిపించకుండా చేయాలని పథకం వేశారు. రాత్రి సమయం కావడంతో అందరూ నిద్రపోతున్నారు. ఎవరూ చూడకుండా ఆమె మృతదేహాన్ని దూరంగా పొలాల్లో పడేశారు. అయితే ఇదంతా తెలుసుకున్న ఇంద్రదేవ్ భార్య పోలీసులను ఆశ్రయించింది. తన కుమార్తెను ఆమె తండ్రి.. తన సోదరులతో హత్య చేసినట్లు తెలిపింది. ఆ తర్వాత మృతదేహాన్ని పొలాల్లో పడేశారని వాగ్మూలం ఇచ్చింది. భార్య ఇచ్చిన వాగ్మూలంతో పోలీసులు ఇంద్రదేవ సహా అతని సోదరులపై కేసు నమోదు చేశారు. ఆ విషయం తెలుసుకున్న ముగ్గురూ పరారయ్యారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.