మనం ఏదైన కంపెనీలో పని చేసే క్రమంలోనే ఉన్నట్టుండి మనల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తే ఎలా ఉంటుంది? తట్టుకోలేని బాధతో పాటు అంతకు మించిన కోపం కూడా ఉంటుంది. ఇకపోతే నోయిడాలో ఓ కంపెనీలో పని చేస్తున్న ఓ ఉద్యోగిని మేనేజర్ ఉన్నట్టుండి అతడిని ఉద్యోగం నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశాడు. ఇక మేనేజర్ ఆదేశాల మేరకు ఆ యువకుడిని ఉద్యోగం నుంచి తొలగించారు. కట్ చేస్తే ఆరు నెలల తర్వాత ఆ ఉద్యోగి తిరిగి వచ్చి మళ్లీ నన్ను ఉద్యోగంలో చేర్చుకోవాలంటూ మేనేజర్ తో గొడవకు దిగాడు. ఇదే విషయమై ఇద్దరూ గొడవ పడ్డారు. ఇక కోపంతో ఊగిపోయిన ఆ యువకుడు ఏకంగా మేనేజర్ ని తుపాకీతో కాల్చాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా ప్రాంతం. స్టెక్టార్ 2లోని ఓ ప్రైవేట్ కంపెనీలో అనూప్ సింగ్ అనే వ్యక్తి ఆపరేటర్ గా పని చేసేవాడు. అయితే కొంత కాలం పాటు ఇక్కడే పని చేసిన అనూప్ సింగ్ ప్రవర్తన నచ్చక మేనేజర్ అతడిని ఆ ఉద్యోగం నుంచి తొలగించాడు. ఉన్నట్టుండి అతడిని ఉద్యోగం నుంచి తొలగించడంతో అనూప్ సింగ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో అనూప్ సింగ్ ఆరు నెలల పాటు ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇదిలా ఉంటే అనూప్ సింగ్ ఇటీవల మరోసారి గతంలో తాను పని చేసిన కంపెనీ వద్దకు వెళ్లాడు. తనను ఉద్యోగం నుంచి తొలగించిన మేనేజర్ ను సంప్రదించి నన్ను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలంటూ కోరాడు. ఇదే విషయమై ఇద్దరూ కొద్దిసేపు గొడవ పడ్డారు.
ఇక కోపంతో ఊగిపోయిన అనూప్ సింగ్ తన వెంట తెచ్చుకున్న తుపాకీతో మేనేజర్ ఛాతిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో మేనేజర్ రక్తపు మడుగులో పడి కిందపడిపోయాడు. వెంటనే స్పందించిన తోటి ఉద్యోగులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతున్న మేనేజర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఉద్యోగం నుంచి తొలగించాడనే కోపంతో మేనేజర్ ను కాల్చిన ఈ దుండగుడి చర్యపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.